AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: నడుపుతున్న స్కూటీ నుంచి బయటికి వచ్చిన అనుకోని అతిథి.. దెబ్బకు గుండెల్లో దడ

మాములుగా మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు తెలిసినవారు ఎవరైనా కనిపిస్తే సరదాగా పలకరిస్తాం. అలా స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఓ అనుకోని అతిథి పలకరించింది. అయితే ఆ అతిథిని చూసి అతని గుండెల్లో ఒక్కసారిగా దడ మొదలైంది. వెంటనే స్కూటీని రోడ్డుపైనే ఆపి పరుగులు తీశాడు. ఇంతకీ ఎవరా అతిథి....?

Kadapa: నడుపుతున్న స్కూటీ నుంచి బయటికి వచ్చిన అనుకోని అతిథి.. దెబ్బకు గుండెల్లో దడ
Snake In Scooty
Ram Naramaneni
|

Updated on: Feb 21, 2025 | 9:20 AM

Share

పాములు అంటే నూటికి 90 మందికి భయం ఉంటుంది. అది కనపడగానే పరుగు లఖించుకుంటారు. ఇంకొందరు అయితే పాము ఫోటో కనిపిచ్చినా హడలిపోతారు. అలాంటి పాము పక్కనే కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయ్. వామ్మో ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా..? కానీ ఇలాంటి ఘటన రియల్‌గా కడప జిల్లాలో జరిగింది. ఇంతకీ పాముతో అలాంటి ఎన్‌కౌంటర్ ఫేస్ చేసిన వ్యక్తి ఎవరు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి…

ఎటునుంచి వచ్చిందో.. ఏమో… రాత్రి వేళ ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన స్కూటీ ముందు భాగంలో ఓ పాము దూరింది. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లిలో వెలుగుచూసింది. ఈ విషయాన్ని గమనించని యజమాని.. పని మీద స్కూటీపై స్థానిక పులివెందుల రోడ్డు నుంచి రాజీవ్ నగర్​ కాలనీ వైపుగా వెళ్తున్నాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా పాము స్కూటీ ముందు భాగంలోంచి బయటకొచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు ఆ స్కూటీ యజమాని బండపల్లి. శివకేశవరెడ్డి. వెంటనే స్కూటీని పక్కన ఆపి కేకలు వేశాడు. ఆ తర్వాత బైక్ మెకానిక్‌కు సమాచారమిచ్చాడు.

స్థానికులు, టీవీఎస్ షోరూం సిబ్బంది దాదాపు 10 మంది రెండు గంటల పాటు శ్రమించి స్కూటీ పార్ట్స్ అన్నీ రిమూవ్ చేశారు. అయినా కానీ పాము లోపల నక్కి బయటకు రాలేదు. స్కూటీకి ఓ పైపు ఉన్న పైపులో కట్ల పాము దాక్కుంది. ఈ పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చి.. ఎక్కడ నక్కి ఉంటాయో తెలీదు అందుకే అప్రమత్తత అవసరం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..