Chandrababu Interrogation: తొలి రోజు ఏం జరిగింది.. రెండో రోజు ఏం జరగనుంది..? చంద్రబాబు విచారణపై సర్వత్రా ఉత్కంఠ..!
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబు విచారణ కొనసాగుతుంది. రెండో రోజు ఇవాళ కూడా సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం చంద్రబాబును విచారించనున్నారు. నిన్న ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది సీఐడీ బృందం.

Chandrababu Interrogation Updates: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబు విచారణ కొనసాగుతుంది. రెండో రోజు ఇవాళ కూడా సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం చంద్రబాబును విచారించనున్నారు. నిన్న ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది సీఐడీ బృందం. సుమారు 6గంటల పాటు రెండు విడతల్లో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ప్రతి గంటకు ఇద్దరు చొప్పున సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. రెండో సెషన్ 3 గంటల పాటువిచారించారు. ప్రతి గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో సీఐడీ విచారణ కొనసాగింది. విచారణ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదితో మాట్లాడుకునే వీలు కల్పించారు. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే.. లోకేష్, కిలారి రాజేష్, పీఏ శ్రీనివాస్ పాత్రపై చంద్రబాబును సీఐడీ అధికారులు ఆరా తీశారు. బాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రతీ విషయాన్ని కూడా పిన్ టు పిన్ టైప్ చేసి సీఐడీ అధికారులు తొలి రోజు విచారణకు సంబంధించిన కీలక వివరాలను నివేదికలో పొందుపరిచారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్‌లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు ప్రశ్నలు సంధించిటనట్లు తెలుస్తుంది. మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ.. మొదటి రోజు 50 ప్రశ్నలను అడిగనట్లు టాక్. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును 3వేల 300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు?, సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు..? జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి..? అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది..? లాంటి పలు ప్రశ్నలను అడిగారు సీఐడీ అధికారులు. 13 చోట్ల నోట్ ఫైళ్లపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు..?, యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?.. డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులను.. తరలించడం సాక్ష్యాధారాల మాయంపైనా సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో జరిగిన ప్రతీ విషయాన్ని పిన్ టు పిన్ టైప్ చేసి నివేదిక రెడీ చేశారు సీఐడీ అధికారులు. 6 గంటల పాటు జరిగిన ఇంటరాగేషన్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేశారు. ఇవాళ కూడా అదే స్థాయిలో విచారణ జరుగుతుందని తెలుస్తుంది. మొదటి రోజు విచారణ తర్వాత సెంట్రల్ జైలు నుంచి గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన సీఐడీ బృందం. ఇవాళ కూడా సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో బాబును విచారించనుంది సీఐడీ.
బాబు విచారణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పడూ న్యాయవాదులను అడిగి తెలుసుకుంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. విచారణ విషయాలను ఎప్పటికప్పుడు లోకేష్‌తో వర్చువల్‌గా చర్చిస్తున్నారు భువనేశ్వరి. అటు బ్రహ్మణి, భువనేశ్వరితో కలిసి ఏడుగురు లాయర్లు లోకేష్‌తో మాట్లాడారు. సీఐడీ విచారణ అంశాలను కుటుంబ సభ్యులకు పిన్‌టు పిన్ వివరించారు లాయర్లు. న్యాయపరంగా ఉన్న అవకాశాలపై చర్చించారు.
సుప్రీంకోర్టుకు చంద్రబాబు..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, ఆయన తరుఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. రేపు విచారణ చేపట్టాలని కోరే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై రేపు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో వాదనలు హోరాహోరిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని 186 పేజీల కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. దర్యాప్తు వివరాలను, సేకరించిన ఆధారాలను కౌంటర్‌లో పొందుపరిచింది సీఐడీ. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు ఎందుకు వర్తించదు?స్కిల్ స్కాంకు సెక్షన్ 409 వర్తిస్తుందని కౌంటర్‌లో వివరించింది సీఐడీ. దీంతో రేపటి ఏసీబీ కోర్టు.. అటు సుప్రీంలో విచారణలపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




