సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రీ-షెడ్యూల్.. ప్రయాణీకులు ఇది గుర్తుపెట్టుకోండి.!
శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ప్రయాణీకులకు ఈ అలెర్ట్. డిసెంబర్ 30వ తేదీ, శనివారం ట్రైన్ నెంబర్ 20701 సికింద్రాబాద్-వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు జరిగాయి.
శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ప్రయాణీకులకు ఈ అలెర్ట్. డిసెంబర్ 30వ తేదీ, శనివారం ట్రైన్ నెంబర్ 20701 సికింద్రాబాద్-వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు జరిగాయి. అనుకున్న సమయానికి ఇవాళ ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయల్దేరాల్సిన ఈ రైలును.. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గుర్తించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడుస్తుండటంతో.. అటు నుంచి వచ్చే తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
మాల్దా – బెంగళూరు అమృత్-భారత్ ఎక్స్‌ప్రెస్..
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శనివారం నుంచి పట్టాలెక్కాయి. మాల్దా -బెంగళూరు మధ్య నడిచే ఈ అమృత్ భారత్ ఎక్‌ప్రెస్ ఏపీలోని గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. ఈ అమృత్-భారత్ ట్రైన్‌లో 12 స్లీపర్-క్లాస్, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి. అలాగే ఈ రైలులో ద్వితీయ శ్రేణి, స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంటాయి.