AP News: ముసలి నక్క.. నాలుగో తరగతి విద్యార్థినిని బలవంతంగా రూమ్‌లోకి తీసుకెళ్లి..
ఏమైపోతోంది ఈ సమాజం... మాయమైపోతుంది మానవత్వం. ఎవడో ఒకడు-ఎక్కడో అక్కడ బరి తెగిస్తూనే ఉన్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారి భవితకు బాటలు వేయాల్సిన స్కూల్ కరస్పాండెంట్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
అతనో పాఠశాలకు కరస్పాండెంట్.. వయస్సు 60 ఏళ్లు పైనే ఉంటుంది. పిల్లలకు స్కూల్లో కష్టనష్టాలు తీర్చి.. వారికి మంచి విద్యను అందిస్తూ.. వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన వ్యక్తి.. ఉన్మాదిలా ప్రవర్తించాడు. నాలుగో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన అనంతపురంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మహిళ.. విబేధాలతో భర్త నుంచి విడిపోయి.. ఇద్దరు కుమార్తెలతో అనంతపురం వచ్చి.. జీవనం సాగిస్తోంది. రెండో కూతుర్ని ఇటీవల టౌన్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో చేర్పించింది. స్కూల్ హాస్టల్‌లో ఉంటూ.. బాలిక చదువుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం.. అన్నం తిన్నాక ప్లేట్ పై ఫ్లోర్‌లో ఉన్న గదిలో పెట్టేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన.. స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ బాలికను బలవంతంగా తన రూమ్‌లోకి తీసుకెళ్లి.. లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించాడు.
గురువారం రాత్రి.. బాలిక తల్లికి ఫోన్ చేసి ఒంట్లో నలతగా ఉందని చెప్పింది. శుక్రవారం తెలిసినవాళ్లతో కలిసి స్కూల్‌కి వెళ్లిన తల్లికి తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి బావురుమంది. దీంతో వారు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు.. పోలీసులు పోక్సో కేసు పెట్టి నిందితుడ్ని రిమాండ్‌కు పంపారు. నిందితుడు మరో బాలికపై కూడా వేధింపులకు పాల్పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..