Cyclone: సైక్లోన్ ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు!
మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారడంతో ఈ వర్షాలు మరింత తీవ్రతరం అయ్యారు. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఏపీకి వాతావరణశాఖ అధికారులు కీలక హెచ్చరకలు జారీ చేశారు. రాష్ట్రానికి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం తుఫాన్‌గా మారి వాయువ్యదిశలో కదులుతూ మరింత బలపడి 28 అక్టోబర్ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి ఈ తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశలో కదిలి కోస్తా ఆంధ్ర తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకు సమీపంలో 28 అక్టోబర్ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో ఈదురు గాలుల వేగము గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. శనివారం నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో వాతవారణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తీర ప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి వంటి జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ఇవ్వాలని సూచించారు.
ఈ తుఫాన్ కారణంగా ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శని, ఆది వారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండటగా. సోమవారం రాష్ట్రం లోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి.




