Andhra: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన లారీ.. ఛేజ్ చేసి తనిఖీ చేయగా
ఆ చెక్ పోస్టులో రోజూలానే సాధారణ తనిఖీలు చేపట్టారు పోలీసులు. అటుగా ఓ లారీ, ఒక కారు.. దూసుకుంటూ చెక్ పోస్టు దాటాయి. వాటిని ఛేజ్ చేస్తూ పోలీసులు ఆపి చెక్ చేయగా.. వామ్మో.! అందులో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.. ఆ వివరాలు..

శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. లారీ, కారుతో సహా రూ 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు స్మగ్లర్లు పట్టుబడ్డారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన స్మగ్లర్లు అడ్డంగా దొరికిపోయారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో ఆపకుండా వేగంగా వెళ్ళిన లారీ, కారును అనుమానంతో వెంబడించారు. ఛేజ్ చేసి పట్టుకున్నారు.
వాహనాలను వదిలి పారిపోయే ప్రయత్నం చేసిన ఏడుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అందులో ఉన్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. లారీతో సహా కారును కూడా సీజ్ చేసారు. రూ. 2.5 కోట్ల విలువ గల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాకు నలుగురు, తమిళనాడుకు చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలు, దొంగలతో పాటు లారీ కారును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.