MLA Rapaka: 32 ఏళ్ల క్రితం జరిగింది చెప్పాను.. దొంగ ఓట్ల కామెంట్స్‌పై రాజోలు ఎమ్మెల్యే రాపాక ఏమన్నారంటే..?
ఏపీ రాజకీయాలు రోజుకో రీతిలో మలుపుతిరుగుతున్నాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అనంతరం.. రాజోలు ఎమ్మెల్యే చేసిన దొంగ ఓట్ల వ్యాఖ్యలు.. కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయాలు మరింత హీటెక్కాయి.

ఏపీ రాజకీయాలు రోజుకో రీతిలో మలుపుతిరుగుతున్నాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అనంతరం.. రాజోలు ఎమ్మెల్యే చేసిన దొంగ ఓట్ల వ్యాఖ్యలు.. కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ క్రమంలో దొంగ ఓట్ల కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వీడియోపై స్పందించారు. 32 ఏళ్ల క్రితం జరిగిన ఘటననే తాను గుర్తు చేశానంటూ డ్యామేజీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు రాపాక. అప్పటి సర్పంచ్ ఎన్నికల విషయాన్ని మాట్లాడానని.. 2019 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు తనకు పడలేదంటూ పేర్కొన్నారు.
నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకి సంబంధించిన ఫుల్ ఫుటేజీని స్వయంగా విడుదల చేశారు ఎమ్మెల్యే రాపాక. ఆ వీడియోలో గతంలో దొంగ ఓట్లు వేసే వాళ్లం అంటూ మాట్లాడారు. అయితే 2019 ఎన్నికలు అనిగాని.. 32 ఏళ్ల క్రితం అని కూడా ఎక్కడా లేదు. అయితే రాపాక దొంగ ఓట్లు వేయించే వాళ్లం అంటూ మాట్లాడడం స్పష్టంగా వినిపిస్తోంది. దొంగ ఓట్ల వల్ల స్పష్టమైన మెజారిటీ వచ్చేదని.. రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు మారతాయని.. ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలంటూ రాపాక ఆ సమావేశంలో మాట్లాడారు.
గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గ వైసీపీ క్యాండేట్ ఓడిపోడానికి నాయకత్వ లోపమే కారణమన్నారు. జగన్ వేవ్‌లోనూ రాజోలులో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం దారుణమన్నారు. దొంగ ఓట్లతో కాదని.. తనకు సత్తా ఉంది కాబట్టే గెలిచానని బొంతుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాపాక.




ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన రాపాక.. 10 కోట్లు ఆఫర్ వచ్చిందన్న రాపాక, మరో అడుగు ముందుకు వేసి తాను దొంగ ఓట్లతోనే గెలిచానన్నారు. సొంతూరు చింతలమోరులో పడిన దొంగ ఓట్ల గురించి చెబుతూ.. తన అనుచరులు ఒక్కొక్కరు పది చొప్పున ఓటేస్తేనే తనకు 800 ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..




