AP Rains: బాబోయ్.! ఏపీకి వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా.. వాతావరణ వివరాలు ఇలా..

AP Rains: బాబోయ్.! ఏపీకి వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
Andhra Weather
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 11, 2024 | 9:41 AM

బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేసింది. అటు సోమవారం నవంబర్ 11న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..