Vizag: విశాఖ కుర్రాళ్లూ.! బీ కేర్‌‌ఫుల్‌.. రోడ్లపై రయ్యి రయ్యిన దూసుకెళ్లినా.. ఇక చుక్కలే

విశాఖలో శబ్ద కాలుష్యానికి కారకులవుతున్న వాహనదారుల తాట తీస్తున్నారు పోలీసులు. మాడిఫైడ్‌ సైలెన్సర్లు వాడేవారిపై డేగ కన్నేశారు. సౌండ్‌ చేసే బైకులతో పట్టుబడ్డారా.. ఇక అంతే సంగతులు.. బైకు సైలెన్సర్లను పీకేసి.. కళ్లముందే రోడ్డు రోలర్‌తో తొక్కించేస్తున్నారు.

Vizag: విశాఖ కుర్రాళ్లూ.! బీ కేర్‌‌ఫుల్‌.. రోడ్లపై రయ్యి రయ్యిన దూసుకెళ్లినా.. ఇక చుక్కలే
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 11, 2024 | 8:17 AM

అభివృద్ధి చెందుతున్న కొద్దీ విశాఖలో జనాభా భారీగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టే వాహనాల సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ట్రాఫిక్ సమస్యలు క్రమంగా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ట్రాఫిక్‌ సంగతి పక్కనపెడితే.. హై స్పీడ్ బైకులు.. రయ్‌.. రయ్యిన రింగులు కొడుతూ రోడ్లపై ఫీట్లు చేసే కుర్రకారు జోరు అంతా ఇంతా కాదు.. ఇది చాలదన్నట్లుగా కొత్తగా సైలెన్సర్లను మోడీఫై చేసి భారీ శబ్ధాలతో జనాలను బెంబేలెత్తిస్తున్నారు. రయ్యిన వెళ్తూ.. హెవీ సౌండ్‌తో గుండెల్లో దడ పుట్టిస్తున్నారు కుర్రోళ్లు. ఇలాంటివారిపై ఫిర్యాదులు ఎక్కువవుతుండడంతో తాటతీసేందుకు సిద్ధమయ్యారు విశాఖ పోలీసులు. ట్రాఫిక్‌ రూల్స్‌ క్రాస్‌ చేస్తున్నవారిని వెతికి మరీ పట్టుకుంటున్నారు. విశాఖ సిటీలో ఎక్కడికక్కడ కాపు కాసి మాడీఫైడ్‌ సైలెన్సర్లను వాడుతున్న యువత బెండు తీస్తున్నారు. దాంతో.. ఒకట్రెండు కాదు.. మాడీఫైడ్‌ సైలెన్సర్లు అమర్చిన 181 బైకులు పట్టుబడ్డాయి. ఆ బైకుల నుంచి మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి బీచ్ రోడ్డులో రోడ్ రోలర్‌తో తొక్కించి హెచ్చరికలు జారీ చేశారు విశాఖ పోలీసులు. హెవీ సైలెన్సర్లను ఉపయోగించడం చట్ట రీత్యా నేరమని.. మూడు నెలల జైలు శిక్ష లేదా 10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని చెప్తు్న్నారు. ఇక.. రేసు బైకులకు మాడిఫైడ్‌ సైలెన్సర్లను అమర్చి యువత సౌండ్‌ పొల్యూషన్‌కు పాల్పడుతున్నారన్నారు విశాఖ ట్రాఫిక్ అడిషనల్‌ DCP ప్రవీణ్‌కుమార్. సీపీ ఆదేశాలతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి మాడిఫైడ్‌ సైలెన్సర్లతో బైకులు నడుపుతున్నవారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

ఇక.. రాత్రి వేళల్లో పెద్ద శబ్ధంతో బైకులు నడపడం వల్ల విశాఖ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు సీపీ శంకబ్రత బాగ్చి. ఎట్టిపరిస్థితుల్లో మాడీఫైడ్‌ సైలెన్సర్లను వాడవద్దని.. వాడి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భారీ జరిమానా, జైలు శిక్ష, లైసెన్స్‌లు రద్దు చేయడం జరుగుతుందని.. సైలెన్సర్లను మాడీఫైడ్‌ చేస్తున్నవారిపైనా యాక్షన్‌ ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు విశాఖ సీపీ బాగ్చి. మరోవైపు.. రోడ్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌లో భాగంగా హెల్మెట్ వాడకంపైనా స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు విశాఖ పోలీసులు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు హెల్మెట్‌ లేకుండా డ్రైవ్‌ చేస్తున్న సుమారు 70వేల మందికి ఫైన్‌లు వేయడమే కాదు.. డ్రైవింగ్ లైసెన్సులు మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మొత్తంగా.. ట్రాఫిక్‌ రూల్స్‌ క్రాస్‌ చేస్తే సీరియస్‌ ఫనిష్‌మెంట్‌ తప్పదంటున్నారు విశాఖ పోలీసులు… తేడా వస్తే తాట తీస్తాం.. గీత దాటితే జైలుకు పంపుతామంటున్నారు.. సో.. విశాఖ యువకులారా.. బీ కేర్‌‌ఫుల్‌..

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..