Kakinada district: సముద్రంలో వల వేసిన జాలరి.. ఏం చిక్కిందో మీరే చూడండి

కాకినాడ జిల్లాలో అరుదైన భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఇలాంటి చేపలు చాలా అరుదుగా దొరుకుతాయని జాలర్లు అంటున్నారు. సముద్ర గర్భంలో ఉండే ఈ చేప పైకి రావడం అరుదట.

Kakinada district: సముద్రంలో వల వేసిన జాలరి.. ఏం చిక్కిందో మీరే చూడండి
Teku Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: May 02, 2022 | 1:50 PM

కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం(U.Kothapalli  Mandal)లో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు వలకు భారీ టేకు చేప లభ్యమైంది. ఉప్పాడ గ్రామం(Uppada Village) మాయపట్నంకి చెందిన మోష అప్పారావు తనకు ఉన్న సంప్రదాయ వలలతో ఆదివారం సముద్రంలోకి సాంప్రదాయ తెప్ప బోటులో చేపల వేటకు వెళ్ళాడు. సముద్రంలో అలివి(వల) వేయగా చాలా చేపలు చిక్కాయి. అందులో సుమారు 50 కిలోలు బరువు ఉండే భారీ టేకు చేప(Teku Fish)కూడా ఉంది. ఈ చేపను కాకినాడకు చెందిన వేలంపాటదారుడు దక్కించుకున్నాడు. భారీ సైజులో ఉండే టేకు చేపలు సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార వలలకు చాలా అరుదుగా చిక్కుతుంటాయి.   సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.. అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. టేకు చేప తినేందుకు పనికిరాదని.. ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని నిపుణులు తెలిపారు.

టేకు చేప వెనుక భాగంలో తోకకు ఉండే ముళ్లు చాలా డేంజర్. సముద్రంలో చిన్న చేపలను తింటూ జీవనం సాగించే ఇవి ఒక్కొక్కటి దాదాపు 500 కేజీల వరకు బరువు పెరుగుతాయట. వీటిపై ఏవైనా పెద్ద సముద్ర జీవరాశులు దాడికి ప్రయత్నించే సందర్భాల్లో ఏనుగు తొండం మాదిరిగా… తోకసాయంతో రివర్స్ అటాక్ చేసి తమను తాము రక్షించుకుంటాయి. సాధారణంగా  సాధు స్వభావంతో స్నేహపూర్వకంగానే మెలిగే ఈ టేకు చేప.. భయపడిన స్థితిలోనే తోకతో దాడి చేస్తుంది.

Also Read: Tirupati: తిరుమల ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు