Rare Snake: అరుదైన కింగ్ కోబ్రా హల్‌చల్.. హడలిపోయిన అటవీశాఖ అధికారులు.. ఎక్కడంటే.?
సుమారు 2900 జాతులు పాముల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో చాలావరకు విషపూరితమైనవి కాగా..
పాములు.. ఈ పేరు వింటేనే మనుషులు భయభ్రాంతులకు గురవుతారు. అది కనిపిస్తే చాలు.. వాటి దరిదాపుల్లో కూడా కనిపించరు. అంటార్కిటికా మినహా ప్రపంచమంతా పాములు విస్తరించిన సంగతి తెలిసిందే. సుమారు 2900 జాతులు పాముల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో చాలావరకు విషపూరితమైనవి కాగా.. అవి ఒక్క కాటుతోనే ఏ జంతువునైనా గంటల్లో మృత్యువు ఒడికి చేర్చగలవు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో అరుదైన నాగుపాము కంటబడింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మండలం చందలంగి అటవీ ప్రాంతంలో అరుదైన కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. ఆ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తుండటంతో అటవీశాఖ అధికారులు వాటిని వేరే చోటకు తరలించేందుకు ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉండే గిరిజన గ్రామాల నుంచి తరిమేస్తుండగా కింగ్ కోబ్రా పిల్ల ఒకటి బుసలు కొట్టింది.
దీంతో అటవీ శాఖ అధికారులు ఒక్కసారిగా హడలిపోయారు. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఆ చిన్న కింగ్ కోబ్రా వాళ్లను భయభ్రాంతులకు గురి చేసింది. అయితే ఇది చిన్న కింగ్ కోబ్రా పిల్ల మాత్రమేనని.. దీని తల్లి కూడా ఇక్కడే ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కింగ్ కోబ్రా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.