గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ధర ఎంతంటే..
అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న యానాం పరిధి దరియాలతిప్ప వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి గాలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద పండుగప్ప చిక్కలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్ఠంగా ఆరు కిలోల వరకే పెరుగుతాయి.

అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న యానాం పరిధి దరియాలతిప్ప వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి గాలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద పండుగప్ప చిక్కలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్ఠంగా ఆరు కిలోల వరకే పెరుగుతాయి. కానీ, నది చేప కావడంతో ఇంతలా పెరిగింది అంటున్నారు మత్స్యకారులు.. దీని రుచి కూడా ఎక్కువగా ఉంటుంది అని మత్స్యకారులు వివరించారు. ఈ చేపను రూ.16 వేలకు విక్రయించారు.
పండుగప్ప ప్రయోజనాలు ఇవే..
పండుగప్ప చేప మాంసంలో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని యానాం మత్స్యశాఖ ఏడీ దడాల గొంతెయ్య చెప్పారు. పండుగప్ప ఆరోగ్యానికి మంచిది. దీనిలోని మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, ఎముకల బలానికి తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. పండుగప్ప చేప సముద్రపు ఉప్పు నీటిలో మంచినీటి నదులలో పెరగడం వీటి ప్రత్యేకత.. చేపలలో రారాజు అయిన పండుగప్ప చేప మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైన చేప..
వీడియో
పులస చేప తర్వాత అత్యంత అమితంగా ఇష్టపడే చేపల్లో పండుగప్ప చేప ఒకటి.. పండుగప్ప చేప ఇగురు పెట్టి ఉంటే చికెన్ తిన్నట్టే ఉంటుందని ఫీల్ అవుతారు మాంసపు ప్రియులు.. పులసల సీజన్ అయిపోయిన తర్వాత బంధువులకు బాగా కావలసిన వారికి ఈ పండుగప్ప చేపను పార్సల్ చేసి మరి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు దేశాలకు పంపిస్తూ ఉంటారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇప్పటివరకు తినకపోతే.. పండుగప్ప చేపను టేస్ట్ చేయండి.. ఎందుకంటే.. ఈ చేప రుచి బాగుంటుందని పేర్కొంటున్నారు మత్స్యకారులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
