Andhra: భూమికి పుట్టిన పువ్వు .. పేరేంటో చెప్పగలరా..?
సాధారణంగా పూల నుంచి రాలే గింజలు కొత్త మొక్కలుగా పరిణమిస్తాయి. మల్లె, విరజాజి, గులాబీ, చామంతి వంటి మొక్కలు అంటు ద్వారా పెరుగుతాయి. అయితే బంతి, కనకాంబరం వంటివి విత్తనాలు నేలపై చల్లితేనే మొలకెత్తుతాయి. కూరగాయల్లో క్యాలీఫ్లవర్ విత్తనాల ద్వారా పెరుగుతుంటే, దుంపజాతిలో...

పువ్వు కొమ్మకు వున్నా.. మగువ సిగలో చేరినా.. దైవానికి దండగా మారినా… వాటి అందం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూవు నుంచి వచ్చే గింజలు రాలిపడి మొక్కలుగా, వృక్షాలుగా ఎదుగుతాయి. మల్లె , విరజాజి , గులాబీ , చామంతి వంటి మొక్కలు అంటు ద్వారా ఎదిగితే బంతి , కనకాంబరం ఇలాంటివి నేలపై విత్తనాలు చల్లి పెంచవచ్చు. ఇక కూరగాయ మొక్కల్లో క్యాలీఫ్లవర్ విత్తనం ద్వారం ఎదిగితే దుంపజాతిలో కంద గడ్డలు భూమిలో నాటడం ద్వారా పంట దిగుబడి వస్తుంది. ఇపుడు మనం చూస్తున్న పువ్వు చాలా అరుదైనది. ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రుకు చెందిన రైతు మట్టా చంటి ఉద్యాన పొలంలో కంద పువ్వు పూసింది. సాధార ణంగా కంద దుంప నుంచి మొక్క భూమి పైకి పెరుగుతుంది. ఇక్కడ మాత్రం అందమైన పువ్వు రావటంతో అందరూ ఈ పువ్వును ఆశ్చర్యంగా చూస్తున్నారు. దీనిపై ఉద్యాన అధికారిణి యాళ్ల దీప్తి మాట్లాడుతూ.. పంట వేసిన ఏడాదికి కంద దుంప తయారు అవుతుందన్నారు. ఆ తయారైన దుంపను భూమి నుంచి తవ్వకుండా అలాగే రెండు, మూడు ఏళ్ల వరకు ఉంచేస్తే ఇలా పువ్వు వస్తుందని వివరించారు. ఐతే రైతులు దుంపలు భూమిలో నాటిన తరువాత పరిమిత సమయంలో తొవ్వి దుంపలను మార్కెట్‌కి తరలిస్తారు. ఐతే ఇలా కంద పుష్పం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
