తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టిటిడి క్లారిటీ.. ఈసారి స్థానికులకు ఇంపార్టెన్స్
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు TTD ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తూ దర్శనాలు కల్పిస్తోంది. జనవరి 2-8 వరకు ఆన్‌లైన్ టోకెన్ దర్శనాలు ఉంటాయి. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని, డిసెంబర్ 2న డిప్ ద్వారా టోకెన్లు పొందవచ్చు. మొత్తం 8 లక్షల మంది భక్తులకు దర్శనం లభిస్తుంది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేసింది TTD. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు TTD ప్రకటించింది. మొదటి మూడు రోజులు సర్వ దర్శనాలకు అనుమతి ఉండదు. మిగిలిన 7 రోజులు సాధారణ భక్తులకే పూర్తి స్థాయిలో దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి 8 వరకు పరిమిత సంఖ్యలో టోకెన్ దర్శనాలు ఉంటాయి. అంటే 300 రూపాయల టికెట్లు 15వేలు.. శ్రీవాణి దర్శన టికెట్లు వెయ్యి కేటాయించినట్టు TTD ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ.. TTD ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల్లో 182 గంటల పాటు వైకుంఠద్వార దర్శన తలుపులు తెరిచే ఉంటాయి. అందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని TTD తెలిపింది. దర్శనాల కోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా భక్తులకు దర్శన టోకెన్స్ కేటాయిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరిచే 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది TTD. మొదటి మూడు రోజులు 2 లక్షల 10వేల మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేలా TTD ఏర్పాట్లు చేసింది. మొత్తంగా.. ఆ 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం దక్కనుంది. మరోవైపు.. నవంబర్ 27న అమరావతిలో శ్రీవారి ఆలయం రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంఖుస్థాపన చేస్తారని TTD ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. కట్‌చేస్తే.. అంత బట్టబయలు
ఎస్వీ యూనివర్శిటీలో చిరుత ప్రత్యక్షం.. భయాందోళనలో విద్యార్ధులు
ఓటుకు నోటు వద్దే వద్దు.. కోతులను తరిమితే చాలు కొత్త సర్పంచ్ మీరే
123 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. 6 నిమిషాల పాటు పూర్తిగా చీకటి
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

