ఎంత కరువు పట్టి ఉన్నార్రా.. రైల్లో ఏసి బోగీలు కూడా వదలరా.. పట్టించిన ర్యాపిడో సవారీ..!
నవంబర్ 13వ తేదీ.. అర్ధరాత్రి.. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై వేగంగా దూసుకెళుతోంది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తన కుటుంబంతో వెళుతున్న బెంగుళూరుకు చెందిన కోదండరామిరెడ్డి గాఢ నిద్రమత్తులో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత చీరాల - ఒంగోలు మధ్య కోదండరామిరెడ్డికి చెందిన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి తీసుకుని పరారయ్యాడు.

నవంబర్ 13వ తేదీ.. అర్ధరాత్రి.. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై వేగంగా దూసుకెళుతోంది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తన కుటుంబంతో వెళుతున్న బెంగుళూరుకు చెందిన కోదండరామిరెడ్డి గాఢ నిద్రమత్తులో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత చీరాల – ఒంగోలు మధ్య కోదండరామిరెడ్డికి చెందిన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి తీసుకుని పరారయ్యాడు. ఏసి బోగీలో అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఈ చోరీని తొలుత ఎవరూ గమనించలేదు.
అయితే నిద్ర మధ్యలో లగేజీని చెక్ చేసుకున్న కోదండరామిరెడ్డి గుండె గుభేలు మంది.. రూ. 48 లక్షల విలువచేసే బంగారు నగలు, విలువైన వస్తువులు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ ఒంగోలు దాటిన తరువాత నెల్లూరుజిల్లా కావలిలో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు ఏసీ బోగీలో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా చీరాల – ఒంగోలు మధ్య చోరీ జరిగిందని గ్రహించారు. సీసీ కెమెరాలో నిందితుడి కదలికలను గుర్తించి ఫోటోను అన్ని రైల్వే స్టేషన్లకు పంపించి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
నిందితుడు నెల్లూరు రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి మరో రైలులో హైదరాబాద్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. తిరిగి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేందుకు హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు ర్యాపిడో బైక్‌పై వచ్చినట్టు సిసి కెమెరా పుటేజ్‌లో బయటపడటంతో ర్యాపిడో బైక్ యజమాని వివరాలను కనుక్కొని నిందితుడి డీటైల్స్ సేకరించారు. ప్రస్తుతం నిందితుడు బంగారాన్ని అమ్మేందుకు విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్నట్టు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకుని పట్టుకున్నారు. నిందితుడు తెలంగాణా రాష్ట్రం బాలాపూర్‌కు చెందిన షకీల్ అహ్మద్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి రూ. 48 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు…
నిందితుడిని పట్టించిన ర్యాపిడో..!
ఎట్టకేలకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు – చీరాల మధ్య ప్రయాణీకుల బ్యాగ్ చోరీకి గురైన కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. నవంబర్ 13వ తేదీన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో A-3 బోగీలో బెంగుళూరుకు చెందిన ప్రయాణీకుల నగల బ్యాగు చోరీకి గురైనట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు, నెల్లూరు రైల్వే పోలీసులు ఈ కేసులో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నేరం జరిగిన రోజు చార్మినార్ రైలు బోగీలోని సీసీ కెమెరా ద్వారా నిందితుడి ఫోటోలను సేకరించారు. ఈ ఫోటో పాత నేరస్థుడితో సరిపోలడంతో ఈ మేరకు నిందితుడు తెలంగాణాకు చెందిన షకీల్‌గా గుర్తించారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచగా హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో ర్యాపిడో బైక్‌పై వచ్చి రైలు ఎక్కుతున్నట్టు గుర్తించి వివరాలు సేకరించారు. ర్యాపిడో బైక్ నెంబర్‌ను సిసి కెమెరా పుటేజ్ ద్వారా గుర్తించి బైక్ యజమానిని విచారించారు. ఎవరు బుక్ చేసుకున్నారో తెలుసుకున్నారు.
వెంటనే నిందితుడి ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానంతో విచారించగా విజయవాడలో చోరీ చేసిన నగలను కరిగించి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే విజయవాడ రైల్వే పోలీసుల సాయంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి చోరీకి గురైన 48 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే బంగారు నగలు, వజ్రాలకు గాను 48 లక్షల 10 వేల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఒంగోలు రైల్వే సిఐ మౌలా షరీఫ్, నెల్లూరు రైల్వే సిఐ సుధాకర్, ఇతర టీం సభ్యులను రైల్వే డిఎస్‌సి మురళీధర్ అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
