Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు.. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. అధికారులు అలర్ట్‌

తెలంగాణలో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు ఏపీలోని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. రాగల ఐదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు.. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. అధికారులు అలర్ట్‌
Rains Alert
Follow us
Surya Kala

|

Updated on: Jul 16, 2024 | 6:28 AM

రాగల ఐదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది.  తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా మేఘాలు విరిగిపడ్డాయా.. వరుణుడు దండెత్తాడా.. కారుమబ్బులన్నీ ధారపోస్తున్నాయా.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొన్నటి వరకు కనిపించకుండాపోయిన వరుణుడు.. గత మూడు రోజుల నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
తెలంగాణలో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు ఏపీలోని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. ఇక సోమవారం జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. భారీ వర్షానికి హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ముంపునకు గురయ్యే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది అధికారులు. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా అల్లూరి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపారు. అటు కోస్తాంధ్ర వ్యాప్తంగానూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని… మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు.
ఇప్పటికే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో కుంటలు, కాలువలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు దగ్గర వరద ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లా రంపచోడవరంలో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ, సూరంపాలెం జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెంన్సీ గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు అలర్ట్‌ అయ్యారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ… గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..