ఏపీలో రోడ్డు ప్రమాదం..బీజేపీ నేత మృతి..
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో మైసూరువారి పల్లికి చెందిన మాజీ సైనికుడు, బీజేపీ రైల్వేకోడూరు మండల అధ్యక్షుడు కారుమంచి వెంకటసుబ్బయ్య మృతిచెందారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పండ్ల వ్యాపారం చేస్తున్న వెంకటసుబ్బయ్య తిరుపతి నుంచి టెంపో వ్యాన్ లో పండ్లు తీసుకుని వస్తుండగా… ఉప్పరపల్లి దాబా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టెంపో ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో టెంపో […]

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో మైసూరువారి పల్లికి చెందిన మాజీ సైనికుడు, బీజేపీ రైల్వేకోడూరు మండల అధ్యక్షుడు కారుమంచి వెంకటసుబ్బయ్య మృతిచెందారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పండ్ల వ్యాపారం చేస్తున్న వెంకటసుబ్బయ్య తిరుపతి నుంచి టెంపో వ్యాన్ లో పండ్లు తీసుకుని వస్తుండగా… ఉప్పరపల్లి దాబా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టెంపో ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో టెంపో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా… పక్కన కూర్చున్న కారుమంచి వెంకటసుబ్బయ్య స్పాట్ లోనే మృతిచెందారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి సుబ్బయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. రోజూ అన్నదానం చెయ్యడంతో పాటు శానిటైజేర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. అటువంటి ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మైసూరువారిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.