Andhra Pradesh: అయ్యో పాపం.. జేసీబీ కింద నలిగిపోయిన కొండ చిలువ..
ఇంట్లో ఎలుక తిరుగుతుంటే బోనులో పట్టి బయట పడేసేదాకా మనశ్శాంతి ఉండదు. చుట్టుపక్కల పాము తిరుగుతుంటే అమ్మో ఇంకేమైనా ఉందా.. చీకట్లో గుమ్మం దాటాలంటేనే హడలిపోతాము. భారీ కొండ చిలువను చూసిన ఆ ప్రాంతం వారికి అది ఎక్కడ నక్కిందో తెలియలేదు. చివరికి జెసీబిని రప్పించి దాని అంతు తేల్చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వెంకటాద్రిపురంలో గత వారం రోజులుగా సుమారు 15 అడుగుల పొడవు గల పెద్ద కొండచిలువ హల్చల్ చేస్తుంది. తరచూ గ్రామస్తులకు కొండచిలువ కంటపడటంతో తీవ్ర భయాందోళన చెందారు. అదే క్రమంలో కొండచిలువ గ్రామంలో కోళ్లను చంపి ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టింది. అయితే దాన్ని గమనించి కొండచిలువను చంపేందుకు సహాయంగా వేరే వ్యక్తులను తీసుకువచ్చే లోపు మాయమయ్యేది. రెండు రోజుల క్రితం ఓ కోడిని తింటూ ఓ వ్యక్తి కంటబడింది. దానిని చూసి భయపడిన అతడు సహాయం కోసం స్థానికులు పిలిచి అక్కడికి చేరుకునే లోపే పక్కనే ఉన్న చెత్తతో పేరుకుపోయిన పెద్ద పొదలలోకి దూరిపోయింది.
అయితే ఆ కొండచిలువను చూసిన వారందరూ హడలెత్తిపోయారు. ఆదమరుపుగా ఉంటే అది మనుషుల మీద కూడా దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన చెందారు. దాంతో ఒంటరిగా రాత్రిపూట సంచరించాలంటేనే భయం వేసే అంతలా వణికిపోయారు. దాన్ని ఎలా అయినా చంపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. కొండచిలువను చంపడం కోసం ఓ జెసిబిని రంగంలోకి దించారు. అది ఎక్కడైతే గ్రామస్తులకు ఎక్కువసార్లు కంటబడిందో అక్కడ ఉన్న ముళ్ళ పొదలను జెసిబి సహాయంతో తొలగించారు.
ముళ్ళ పొదలు తొలగిపోవడంతో అందులో నుండి భారీ కొండచిలువ బయటికి వచ్చింది. ఇక అమాంతం జెసిబి ఆపరేటర్ జెసిబికి ఉన్న ఇనుప పళ్ళ తొట్టెతో దానిని బలంగా కొట్టి హతమార్చాడు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొంత కాలంగా కంటిమీద కునుకు లేకుండా కొండచిలువ భయంతో బిక్కుబిక్కున బతికిన గ్రామస్తులకు ఉపశమనం లభించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..