Mahanandi: మహానంది క్షేత్రంలో భక్తులు వర్సెస్ ఆలయసిబ్బంది మధ్య ఘర్షణ..
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ తలెత్తింది. మాట మాట పెరిగి ఒకరి పై ఒకరు దాడులకు దిగారు. పోలీసులు పరిస్థితి సద్దుమణించి భక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతపురం జిల్లా నర్రప్పల మండలానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన యాత్రికులు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు.
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ తలెత్తింది. మాట మాట పెరిగి ఒకరి పై ఒకరు దాడులకు దిగారు. పోలీసులు పరిస్థితి సద్దుమణించి భక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతపురం జిల్లా నర్రప్పల మండలానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన యాత్రికులు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు అష్టాదశ మహామంగళ హారతులు ఇస్తారు. ఈ సమయంలో సాదారణ భక్తుల దర్శనం అపివేస్తారు. మహాంమగళహారతులు దర్శించుకోవాలంటే భక్తులు 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ హారతి సమయంలో వచ్చిన అనంతపురానికి చెందిన దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు ప్రత్యేక రుసుము చెల్లించాలని ఆలయ సిబ్బంది సూచించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలంటే ఎందుకు డబ్బులు కట్టాలని భక్తులు నిలదీశారు. ఈ క్రమంలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య మాట మాటా పెరిగి ఒకరి పై ఒకరు దాడులకు తెగబడ్డారు.పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగించారు. యాత్రికులను అందరిని స్థానిక మహానంది పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. దేవస్థానం ఆదాయమే పరమావధిగా భక్తుల నుంచి సేవల రూపంలో డబ్బులు వసూలు చేస్తూన్నారనే అరోపణలు భక్తుల నుంచి వెల్లువెత్తాయి. ఉచిత దర్శనాల విషయంలో సరైన బోర్డులు లేకపోవడంతో భక్తులు టిక్కెట్ రుసుం చెల్లించే వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన అధికారులు ఉచిత దర్శనం క్యూలైన్లకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చెయ్యాలని భక్తులు డిమాండ్ చేస్తూన్నారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..