AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pedarayudu: రజనీకాంత్ వల్ల ‘పెదరాయుడు’ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేసి ఉంటే..

మోహన్ బాబు సినిమా కెరీర్‌లో మరుపురాని చిత్రం పెదరాయుడు. ఈ మూవీ థియేటర్లలో విడుదలై 30 ఏళ్లు గడిచిపోయాయ. అయినా ఇప్పటికీ బుల్లితెరపై వస్తే టీవీలకు అతుక్కుపోతారు. రవిరాజా పినిశెట్టి తెరకెక్కించిన ఈ మూవీలో రజనీకాంత్ ఓ కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

Pedarayudu: రజనీకాంత్ వల్ల 'పెదరాయుడు'ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేసి ఉంటే..
Pedarayudu Movie
Basha Shek
|

Updated on: Feb 20, 2026 | 9:56 PM

Share

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన సినిమా కెరీర్ లో 500కు పైగా సినిమాలు చేసి ఉండచ్చు. అందులో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ ఉండచ్చు. కానీ మోహన్ బాబు కెరీర్ లో మరుపురాని చిత్రం ఏదంటే పెదరాయడే అని చెప్పవచ్చు. 1995 జూన్ 25న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మోహన్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవిరాజా పినిశెట్టి తెరకెక్కించిన పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ పాపారాయుడు పాత్రలో అదరగొట్టారు. భానుప్రియ, సౌందర్య ల అందం, అభినయం, విలన రాజ్ కరుడుగట్టిన విలనిజం, కోటి పాటలు ‘పెదరాయుడు’ సినిమాను బ్లాక్ బస్టర్స్ గా నిలిపాయి. కాగా తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ‘నట్టమై’ సినిమాకు తెలుగు రీమేక్ గా పెద రాయుడు మూవీ తెరకెక్కింది. దీంతో ఈ మూవీని తెలుగులోనూ రీమేక్ చేయాలని దర్శకుడు కే.ఎస్. రవి కుమార్ భావించాడు. అందుకోసం మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ కూడా చెప్పాడట. ఇలా వీరి డిస్కషన్ జరుగుతుండగానే మోహన్ బాబు కూడా కథ బాగా నచ్చడంతో దాన్ని రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించాడట. కానీ డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్, డబ్బింగ్ రైట్స్ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, తాను ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేయబోతున్నాని చెప్పాడట.

ఇదంతా జరిగిన తర్వాత మోహన్ బాు తన స్నేహితుడు రజినీకాంత్‌కి కాల్ చేశాడట. సూపర్ స్టార్ రికమెండేషన్‌తో పెదరాయుడు రీమేక్ రైట్స్‌ దక్కించుకున్నాడట. స్వయంగా రజినీకాంత్ ఫోన్ చేసి, రీమేక్ రైట్స్ కావాలని అడగడంతో తాను కాదనలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్. అలా రజనీకాంత్ వల్ల పెదరాయుడు సినిమాను మెగాస్టార్ మిస్ అయ్యారాట. ఒక వేళ చిరంజీవి గనక ఈ పెదరాయుడు సినిమా చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో మరి.

రజనీకాంత్ వద్దన్నా మరీ పట్టుబట్టి..

కాగా పెదరాయుడు సినిమాలో పాపారాయుడు పాత్రని తానే చేస్తానని రజినీ ముందుకొచ్చినా మోహన్ బాబు వద్దన్నారట. నిడివి తక్కువగా ఉండటం, పైగా చనిపోయే రోల్ కావడంతో ప్రేక్షకులు హర్ట్ అవుతారేమోనన్న భయంతో మోహన్‌బాబు రజనీని వద్దు అన్నారట.అయినా రజనీనే పట్టుబట్టి మరీ ఈ రోల్ లో నటించారట. అది కూడా ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us