Andhra Pradesh: గోడ వెనుక నుంచి చిత్రవిచిత్రమైన శబ్ధాలు.. దగ్గరకెళ్లి చూడగా గుండె గుభేల్..!
చేపలవలలో భారీ కొండచిలువ చిక్కుకుంది. ఎప్పుడు చిక్కుకుందో ఏమో కానీ.. విలవిల్లాడిపోతుంది. గాయాలతో నీరసించి పోయింది. అరగంట పాటు శ్రమించి అతి కష్టం మీద వల నుంచి కొండచిలువను బయటకు తీశారు. సపర్యలు చేస్తున్నారు. విశాఖ భీమిలి శుభాష్ కాలనీ నుంచి స్నేక్ క్యాచర్ కు ఓ ఫోన్ కాల్. చేపలవలలో భారీ కొండచిలువ చిక్కుకుందని ఆ కాల్ సారాంశం. బోర్డులో చేపలు పడుతున్నప్పుడు కొండచిలువ చిక్కిందా అన్న అనుమానం.

చేపలవలలో భారీ కొండచిలువ చిక్కుకుంది. ఎప్పుడు చిక్కుకుందో ఏమో కానీ.. విలవిల్లాడిపోతుంది. గాయాలతో నీరసించి పోయింది. అరగంట పాటు శ్రమించి అతి కష్టం మీద వల నుంచి కొండచిలువను బయటకు తీశారు. సపర్యలు చేస్తున్నారు. విశాఖ భీమిలి శుభాష్ కాలనీ నుంచి స్నేక్ క్యాచర్ కు ఓ ఫోన్ కాల్. చేపలవలలో భారీ కొండచిలువ చిక్కుకుందని ఆ కాల్ సారాంశం. బోర్డులో చేపలు పడుతున్నప్పుడు కొండచిలువ చిక్కిందా అన్న అనుమానం. కాదు.. భీమిలి ప్రాంతంలోనే ఆశ్రమం వెనుక ఉన్న పొదల వద్ద చేపల వల ఉంది. అందులో ఎక్కడ నుంచో వచ్చిందో ఏమోగానీ ఓ భారీ కొండచిలువ చిక్కుకుంది. జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి కాల్ అందుకున్న స్నేక్ క్యాచర్.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. వెళ్లి చూసేసరికి భారీ కొండచిలువ. ఎప్పటినుంచి ఆ వలలో ఉందేమో కానీ.. గాయాలతో అప్పటికే నిరసించిపోయింది. ఒకవైపు నీరసించినప్పటికీ.. కసితో కోపంలో కనిపిస్తోంది. స్నేక్ కేసర్ కిరణ్ ఆ వల వద్దకు చేరుకొని.. చూసేసరికి కొండచిలువ శరీరమంతా వాళ్లకు చెందిన వైర్లతో పూర్తిగా చుట్టుకుని ఉంది.
40 నిమిషాలు శ్రమించి..
దీంతో ఒక్కో వైరు తొలగించేసరికి దాదాపుగా 40 నిమిషాల సమయం పట్టింది. ఎట్టకేలకు వలను కత్తిరించి కొండచిలువ బయటకు తీసినప్పటికీ.. గాయాలపాలై ఉంది ఆ కొండ చిలువ. 15 అడుగుల కొండచిలువకు సఫర్యలు చేశారు.
వైద్యం సహాయం కోసం..
దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. కొందచిలువకు వైద్య సహాయం అవసరమని అంటున్నాడు స్నేక్ క్యాచర్ కిరణ్. గాయాలతో ఉన్న కొండచిలువకు పశువైద్యం సాయంతో కుట్లు వేస్తే ప్రాణాపాయం తప్పుతుందని అంటున్నాడు. వైద్యం చేయించాక కొండచిలువను అడవిలో వదిలి పెడదామని అంటున్నారు. తొలుత కొండ చిలవను చూసి అమ్మో అన్న వారంతా.. చివరకు దాని పరిస్థితి చూసి అయ్యో అనక తప్పలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..