Andhra Pradesh: విశాఖలో గవర్నర్ 5 రోజుల పర్యటన.. అరకు టూర్ అందుకే రద్దు చేసుకున్నారా?
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలిసారి గవర్నర్ హోదాలో విశాఖలో పర్యటనకు విచ్చేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు ఆయన విశాఖలో ఉండనున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం సతీసమేతంగా విశాఖకు చేరుకునున్నారు గవర్నర్. రాష్ట్ర గవర్నర్ హోదాలో తొలిసారి పర్యటన కావడం తో విశాఖ అధికార యంత్రాంగం అంతా ఎయిర్ పోర్ట్ చేరుకుని ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్, మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్, డీసీపీ, మునిసిపల్ కమిషనర్..

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలిసారి గవర్నర్ హోదాలో విశాఖలో పర్యటనకు విచ్చేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు ఆయన విశాఖలో ఉండనున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం సతీసమేతంగా విశాఖకు చేరుకునున్నారు గవర్నర్. రాష్ట్ర గవర్నర్ హోదాలో తొలిసారి పర్యటన కావడం తో విశాఖ అధికార యంత్రాంగం అంతా ఎయిర్ పోర్ట్ చేరుకుని ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్, మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్, డీసీపీ, మునిసిపల్ కమిషనర్.. అధికార యంత్రాంగం అంతా విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికి.. నేరుగా అక్కడ నుంచి పోర్ట్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారు
గవర్నర్ షెడ్యూల్ ఇలా..
1. తొలుత శనివారం ఉదయం నోవాటెల్ హోటల్‌లో జరగనున్న సమాచార కమిషనర్ల జాతీయ సమాఖ్య సదస్సు ను ప్రారంభించనున్నారు గవర్నర్.
2. శనివారం సాయంత్రం ఆంధ్రా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొంటారు. దాదాపు 2,000 మందికి పట్టాలు ప్రధానం చేయనున్నారు.
3. సాహితీ రంగంలో కొనకలూరు ఇనాక్ కు, సైన్స్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో అల్లూరి ఇంద్ర కుమార్ కు ఆంధ్రా విశ్వవిద్యాలయం తరపున గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారు.
4. 11వ తేదీన విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని సందర్శిస్తారు రాష్ట్ర గవర్నర్. ఆమేరకు తూర్పు తీర నౌకాధికారులు ఇప్పటికే గవర్నర్ కలిసి విజిట్ చేయాల్సిందిగా అభ్యర్ధించారు.
5. 12న రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్‌లో జరిగే జైళ్ల శాఖ జాతీయ సదస్సును ప్రారంభించి కీలక ఉపన్యాసం చేయనున్నారు.
6. అదేరోజు మంగళవారం తిరిగి గన్నవరం చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు షెడ్యూలు ప్రకటించాయి.
అరకు టూర్ రద్దు..
టూర్ షెడ్యూల్‌లో ఈనెల 10 వ తేదీ ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులో పర్యటించాలని ముందు షెడ్యూల్ చేశారు. అయితే అక్కడకు వెళ్లేందుకు హెలికాఫ్టర్ కు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, రహదారి మార్గం సురక్షితం కాదని అధికారులు సూచించడంతో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




