AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దారుణం.. డ్రైవర్‌ను బస్సుతో తొక్కించి, కిలో మీటర్ వరకు ఈడ్చుకెళ్లిన మరో బస్సు డ్రైవర్..!

చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చిన్న పాటి గొడవతో బస్సుతో ఢీకొట్టి చంపేశాడు మరో బస్సు డ్రైవర్ ఈ దారుణం బంగారుపాళ్యం మండలం మహసముద్రం టోల్‌గేట్ వద్ద చోటుచేసుకుంది. తోటి డ్రైవర్‌ అన్న కనికరం లేకుండా బస్సుతో తొక్కించి హతమార్చాడు మరో బస్సు డ్రైవర్..! సుమారు కిలోమీటర్ దూరం వరకు మృతదేహన్ని లాక్కెళ్లాడు. దీంతో డెడ్ బాడీ చిద్రమైంది.

Bus Accident
Balaraju Goud
|

Updated on: Jul 24, 2024 | 11:51 AM

Share

చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చిన్న పాటి గొడవతో బస్సుతో ఢీకొట్టి చంపేశాడు మరో బస్సు డ్రైవర్ ఈ దారుణం బంగారుపాళ్యం మండలం మహసముద్రం టోల్‌గేట్ వద్ద చోటుచేసుకుంది. తోటి డ్రైవర్‌ అన్న కనికరం లేకుండా బస్సుతో తొక్కించి హతమార్చాడు మరో బస్సు డ్రైవర్..! సుమారు కిలోమీటర్ దూరం వరకు మృతదేహన్ని లాక్కెళ్లాడు. దీంతో డెడ్ బాడీ చిద్రమైంది.

బెంగళూరు నుంచి విజయవాడకు మార్నింగ్ స్టార్, కృష్ణ ట్రావెల్స్ కు చెందిన రెండు ప్రైవేటు బస్సులు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం రాజుకుంది. మహాసముద్రం టోల్‌గేట్ వద్ద ఒక బస్సు అద్దం, మరో బస్సుకు తాకడంతో గొడవ అంటుకుంది. దీంతో రెండు బస్సుల డ్రైవర్లు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలోనే శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్లిన మార్నింగ్ స్టార్ బస్ డ్రైవర్ సుధాకర్ రాజు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో సుధాకర్ రాజుపైకి బస్సును ఎక్కించి హతమార్చాడు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు.

బస్సుతో సుధాకర్ రాజును ఢీకొట్టడమే కాకుండా మృతదేహాన్ని కిలో మీటర్ దూరం వరకు ఈడ్చుకు వెళ్లాడు. దీంతో డెడ్ బాడీ పూర్తిగా ఛిద్రమైంది. ఈ ఘటనకు సంబంధించి తోటి డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి ముందస్తు సమాచారంతో విజయవాడలో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు అదుపులో తీసుకున్నారు.

వీడియో చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?

గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..

ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..

నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..

బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..

పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!

3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?

కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..

గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి