Prakasam: పొలం మధ్యలోని పొదల్లో పోటుగాడు.. జనం అంతా పరారు..
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం పెద్ద చెరువు గ్రామ సమీపంలోని పొలాల్లో 8 అడుగుల కొండచిలువ కనిపించడంతో రైతులు భయాందోళనలో పడారు. వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరి కొండచిలువను బంధించి, సురక్షితంగా నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ..

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పెద్ద చెరువు గ్రామం సమీపంలోని పొలాల్లో రైతులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. పొలాల్లో 8 అడుగుల కొండచిలువ కనిపించడంతో వారు ఆందోళన చెందారు. వెంటనే సమాచారం అటవీశాఖకు అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరారు.
అటవీశాఖ అధికారులు కొండచిలువను సురక్షితంగా బంధించి, దానికి ఏ విధమైన హాని కలగకుండా కాపాడారు. తరువాత స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. భారీ కొండచిలువను చూసి, పొలాల్లో ఉన్న రైతులు ఊపిరి పీల్చారు. ఈ ఘటన స్థానిక రైతులు, అటవీ సిబ్బంది మధ్య సమన్వయాన్ని మరోసారి చాటిచెప్పింది. కాగా ఇలా పాములు, ఇతర వన్యప్రాణాలు ఏమైనా కనిపిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని.. వాటికి హాని కలిగించవద్దని.. అటవీ సిబ్బంది కోరుతున్నారు.
వీడియో దిగువన చూడండి..




