Ap And Telangana Polling
ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 9.05శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు ఎన్నికల అధికారులు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
వివిధ రాష్ట్రాల్లో 9 గంటల వరకు నమోదైన పోలింగ్..
- ఆంధ్రప్రదేశ్ – 9.21%
- బీహార్ -10.18%
- జమ్మూ అండ్ కాశ్మీర్ – 5.07%
- జార్ఖండ్ -11.78%
- మధ్యప్రదేశ్ -14.97%
- మహారాష్ట్ర – 6.45%
- ఒడిస్సా – 9.23%
- తెలంగాణ – 9.51%
- ఉత్తర ప్రదేశ్ – 11.67%
- వెస్ట్ బెంగాల్ – 15.24%
ఏపీలో 9 గంటల వరకు 9.21 శాతం పోలింగ్ నమోదు..
- కడపలో 12.09 శాతం
- చిత్తూరులో 11.84శాతం
- బాపట్లలో 11.36 శాతం
- అల్లూరిలో 6.77 శాతం
- అనకాపల్లిలో 8.37 శాతం
- అనంతపురంలో 9.18 శాతం
- అన్నమయ్యలో 9.89 శాతం
- కృష్ణాలో 10.80 శాతం
- కోనసీమలో 10.42 శాతం
- నంద్యాలలో 10.32 శాతం
- విశాఖలో 10.24 శాతం
- ఏలూరులో 9.9 శాతం
- ప.గో.లో 9.57 శాతం
- నెల్లూరులో 9.51 శాతం
- కర్నూలులో 9.34 శాతం
- ప్రకాశంజిల్లాలో 9.14 శాతం
- ఎన్టీఆర్ జిల్లాలో 8.95 శాతం
- విజయనగరంలో 8.77 శాతం
- తూ.గో.లో 8.68 శాతం
- పల్నాడులో 8.53 శాతం
- శ్రీకాకుళంలో 8.30 శాతం
- తిరుపతిలో 8.11 శాతం
- గుంటూరులో 6.17 శాతం
- కాకినాడలో 7.95 శాతం
- సత్యసాయి జిల్లాలో 6.92 శాతం
- మన్యంజిల్లాలో 6.30 శాతం
తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదు..
- ఆదిలాబాద్‌లో 13.22 శాతం
- జహీరాబాద్‌లో 12.88 శాతం
- నల్గొండలో 12.80 శాతం
- ఖమ్మంలో 12.24 శాతం
- మహబూబాబాద్‌లో 11.94 శాతం
- మెదక్‌లో 10.99 శాతం
- నిజామాబాద్‌లో 10.91 శాతం
- భువనగిరిలో 10.54 శాతం
- మహబూబ్‌నగర్‌లో 10.33 శాతం
- కరీంనగర్‌లో 10.23 శాతం
- నాగర్‌కర్నూల్‌లో 9.81 శాతం
- పెద్దపల్లిలో 9.53శాతం
- వరంగల్‌లో 8.97 శాతం
- చేవెళ్లలో 8.29 శాతం
- మల్కాజ్‌గిరిలో 6.20 శాతం
- హైదరాబాద్‌లో 5.6 శాతం
- సికింద్రాబాద్‌లో 5.40 శాతం
ఉప ఎన్నికలో..
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 6.28 శాతం
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…