Viral Video: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేయగా.. ఇంటికొచ్చిన పార్శిల్ చూసి దెబ్బకు కంగుతిన్నాడు.!

ఆన్‌లైన్ వాడకం వచ్చిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ కూడా ఇంటినుంచే ఒక్క క్లిక్‌తో ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఏ అవసరమున్నా.. ఫోన్ ద్వారా తమ పని పూర్తి చేస్తున్నారు. ఈ రోజుల్లో, ఆన్‌లైన్ షాపింగ్‌కు క్రేజ్ విపరీతంగా ఉంది. అయితే కొన్నిసార్లు ఈ ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Viral Video: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేయగా.. ఇంటికొచ్చిన పార్శిల్ చూసి దెబ్బకు కంగుతిన్నాడు.!
Viral Post
Follow us

|

Updated on: May 13, 2024 | 10:02 AM

ఆన్‌లైన్ వాడకం వచ్చిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ కూడా ఇంటినుంచే ఒక్క క్లిక్‌తో ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఏ అవసరమున్నా.. ఫోన్ ద్వారా తమ పని పూర్తి చేస్తున్నారు. ఈ రోజుల్లో, ఆన్‌లైన్ షాపింగ్‌కు క్రేజ్ విపరీతంగా ఉంది. అయితే కొన్నిసార్లు ఈ ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కస్టమర్లు మోసపోవడం కూడా చూస్తూనే ఉంటాం. ఆన్‌లైన్‌లో ఓ వస్తువు ఆర్డర్ పెడితే.. ఇంటికొచ్చిన పార్శిల్‌లో వేరొకటి ఉండటం.. లేక అది డ్యామేజ్ కావడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమెజాన్ నుంచి రూ.లక్ష విలువైన ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేస్తే.. ఇంటికొచ్చిన పార్శిల్ చూసి దెబ్బకు షాకయ్యాడు. ఈ ఉదంతాన్ని ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు.

రోహన్ దాస్ అనే నెటిజన్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో షేర్ చేశాడు. ‘ఆన్‌లైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ తనను మోసం చేసిందని’ క్యాప్షన్ ఇచ్చాడు. నేను కొత్త ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేశానని, అయితే అమెజాన్ వాడేసిన ల్యాప్‌టాప్‌ని తనకు పార్శిల్‌లో ఇంటికి పంపించిందని రాసుకొచ్చాడు. అమెజాన్ నన్ను మోసం చేసింది! పాత వస్తువులను కొత్తవిగా విక్రయిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నాకు ల్యాప్‌టాప్ ఇప్పుడొస్తే.. దాని వారంటీ డిసెంబర్ 2023లోనే మొదలైందని పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.