Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulivendula Politics: పులివెందులలో రాజకీయ సంచలనం.. వైఎస్ కుటుంబ రాజకీయ ప్రత్యర్ది వైసీపీలోకి..!

పులివెందులలో రాజకీయ సమీకరణాలు హాట్ హాట్ గా మారాయి. నిన్న మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నేత ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలపబోతున్నారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నా నేత, ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆ నేత ఇప్పుడు ప్రత్యక్షంగా వైసీపీలో చేరడానికి సన్నద్ధమయ్యారు.

Pulivendula Politics: పులివెందులలో రాజకీయ సంచలనం.. వైఎస్ కుటుంబ రాజకీయ ప్రత్యర్ది వైసీపీలోకి..!
Satish Reddy Pulivendula
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Feb 24, 2024 | 9:03 PM

పులివెందులలో రాజకీయ సమీకరణాలు హాట్ హాట్ గా మారాయి. నిన్న మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నేత ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలపబోతున్నారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నా నేత, ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆ నేత ఇప్పుడు ప్రత్యక్షంగా వైసీపీలో చేరడానికి సన్నద్ధమయ్యారు.

కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. వైఎస్ కుటుంబం రాజకీయ ఆరంగ్రీటం చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు పులివెందులలో వారిని తాకే నాయకుడు గానీ, వారిని గెలిచే నాయకుడు గానీ అక్కడ లేరు. రాజారెడ్డి కాలం నుంచి ప్రస్తుత సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఓటమి ఎరుగని నేతలుగా వారే అక్కడ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి 2019 ఎన్నికల వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా వారికి అపానెంట్గా నిలబడిన సతీష్ రెడ్డి, ఇప్పుడు వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ప్రకటించారు అధినేత చంద్రబాబు. దీంతో వైసీపీ నేతలు సతీష్ రెడ్డిని కలిసి సీఎం ఆదేశాల మేరకు వచ్చామని వైసీపీలో చేరాలని సతీష్ రెడ్డిని కోరారట. వారి ఆహ్వానాన్ని సతీష్ రెడ్డి కూడా అంగీకరించినట్లే తెలుస్తోంది. అయితే రెండు రోజులు టైం కావాలని కేడర్‌తో సంప్రదింపులు జరిపి, పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని సతీష్ రెడ్డి తెలిపినట్లు వైసిపి నేతలు అంటున్నారు. సతీష్ రెడ్డిని కలవడానికి వెళ్లిన వారిలో కడప జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు, రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఉన్నారు.

వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు సతీష్ రెడ్డిని కలిసి పార్టీలోకి రావాలని కోరినట్లు సమాచారం. ఇది సీఎం వైఎస్ జగన్ స్వయంగా పంపించారని సతీష్ రెడ్డితో చెప్పడంతో సతీష్ రెడ్డి కూడా సుముకుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు తమ సొంత గూటికి చేరడంతో పులివెందులలో తిరుగులేని వైఎస్ కుటుంబానికి మరింత బలం చేకూరినట్లు అయిందని స్థానిక నేతలు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు