మంత్రి నానిపై హత్యాయత్నం కేసు.. కోల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు.. మచిలీపట్నంలో హైటెన్షన్..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దూకుడు పెంచారు.

మంత్రి నానిపై హత్యాయత్నం కేసు.. కోల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు.. మచిలీపట్నంలో హైటెన్షన్..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో విచారణకై పోలీసులు నేరుగా మాజీ మంత్రి, టీడీపీ నేతల కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లారు. మంత్రిపై హత్యాయత్నం కేసులో విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 91 సెక్షన్ కింద రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో పోలుసులే నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని కేసులో విచారణకు ఎలా పిలుస్తారని పోలీసులను రవీంద్ర ప్రశ్నించారు. మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న తనను ఎలా పోలీస్ స్టేషన్‌కు రమ్మంటారని డీఎస్పీని నిలదీశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే వివరాలను వెల్లడించానని, ఇంకా విచారణకు హాజరవ్వాల్సి అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇదిలాఉండగా కొల్లు రవీంద్ర నివాసానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.