AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Notes: అమ్మో.. నకిలీ నోట్లు.. రూ.55 లక్షల విలువైన నోట్లు స్వాధీనం

రెండు వేల రూపాయిల నోట్లు మార్పిడికి రిజర్వు బ్యాంక్ ఇచ్చిన గడువు ముగింపు దగ్గర పడుతున్న కొద్ది.. వాటి పేరు చెప్పి జరుగుతోన్న మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ విశాఖపట్నంలో ఏకంగా ఓ మహిళ రిజర్వు ఇన్‌స్పెక్టర్ కటకటాల పాలైన సంగతి అందరికి తెలిసిందే. రెండు వేల రూపాయిల నోట్లు ఎవరి వద్దైన పెద్ద మొత్తంలో ఉంటే వాటిని కమిషన్ తీసుకొని మారుస్తామని...లేదా తమ వద్ద పెద్ద మొత్తంలో రెండు వేల రూపాయిల నోట్లు ఉన్నాయని.. వాటిని ఎవరైనా మార్పిడి చేసినట్లయితే కమీషన్ ఇస్తామని చెప్పి పలు ముఠాలు ఇటీవల యథేచ్చగా తిరుగుతున్నాయి.

Fake Notes: అమ్మో.. నకిలీ నోట్లు.. రూ.55 లక్షల విలువైన నోట్లు స్వాధీనం
Police
S Srinivasa Rao
| Edited By: Aravind B|

Updated on: Aug 30, 2023 | 6:26 PM

Share

రెండు వేల రూపాయిల నోట్లు మార్పిడికి రిజర్వు బ్యాంక్ ఇచ్చిన గడువు ముగింపు దగ్గర పడుతున్న కొద్ది.. వాటి పేరు చెప్పి జరుగుతోన్న మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ విశాఖపట్నంలో ఏకంగా ఓ మహిళ రిజర్వు ఇన్‌స్పెక్టర్ కటకటాల పాలైన సంగతి అందరికి తెలిసిందే. రెండు వేల రూపాయిల నోట్లు ఎవరి వద్దైన పెద్ద మొత్తంలో ఉంటే వాటిని కమిషన్ తీసుకొని మారుస్తామని…లేదా తమ వద్ద పెద్ద మొత్తంలో రెండు వేల రూపాయిల నోట్లు ఉన్నాయని.. వాటిని ఎవరైనా మార్పిడి చేసినట్లయితే కమీషన్ ఇస్తామని చెప్పి పలు ముఠాలు ఇటీవల యథేచ్చగా తిరుగుతున్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోను పలు ముఠాలు రెండు వేల రూపాయిల నోట్లు మార్పిడి పేరుతో మోసాలకు తెగపడుతున్నాయి. అటువంటి ఓ ముఠా గుట్టు రట్టు చేశారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు.

జిల్లాలో కలకలం రేపినటువంటి ఈ కేసులో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు పోలీసులకు పట్టు బడ్డాయి. రెండు వేరు వేరు ఘటనల్లో మొత్తం 55 లక్షల రూపాయిల నకిలీ రెండు వేల రూపాయిల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ నోట్లను, ఓ కారును సీజ్ చేశారు. ముందుగా ఈ నెల 24 న ఎచ్చెర్ల మండలం చిలకపాలేం జంక్షన్ వద్ద ముందుస్తు సమాచారంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలానికి చెందిన దుంగ వీరమనికంట అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 37 లక్షల రూపాయల 2 వేలు దొంగ నోట్లును పట్టుకుని అతనిపై కేసు నమోదు చేశారు. అతనిచ్చిన సమాచారంతో మంగళవారం రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద వావానల తనిఖీలలో భాగంగా కారులో తరలిస్తున్న 17 లక్షల 98 వేల రూపాయల 2వేల రూపాయల దొంగనోట్లు పట్టుకున్నారు. ఈ ఘటనలో విజయనగరం కి చెందిన గనగల్ల విజయకుమార్, కర్ణాటకకు చెందిన వెంకటరెడ్డి అనే ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

కర్ణాటక నుండి తీసుకువచ్చిన దొంగ నోట్లు ఈ నకిలీ నోట్లను నిందితులు కర్ణాటక నుండి తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పై వ్యక్తులు ప్రజలకు 2000 రూపాయాల నోట్లు మార్పిడి చేస్తామని ఆశ చూపించటం,దొంగనోట్లను అసలు నోట్లుగా మార్పిడి చేయటం వంటి మోసాలకి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు ఆత్యాశకు పోయి మోసపోవద్దని ఇలాంటి నిందితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి నిందితులు ఎక్కడైనా తారస పడితే దగ్గరలోని పోలీస్ స్టేషన్లలోగాని డయల్ 100కి గాని సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఈ నకిలీ నోట్ల కేసులు రోజురోజుకు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు నకీలు నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దుండగులను అదుపులోకి తీసుకొని శిక్షించినా కూడా ఇలాంటి మోసాలు ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే అలా నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే