AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మురుగు నీటి కాలువ వద్ద పోలీసు బందోబస్తు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారంతే

పోలీసులు బందోబస్తు నాయకుల వద్ద, ట్రాఫిక్ లో సభల్లో ఎక్కడెక్కడో డ్యూటీ చేయటం చూశాం.. ఎక్కడైనా మురికి కాలువకు బందోబస్తు పెట్టడం ఎక్కడైనా చూసారా.. చూడకపోతే చూపిస్తాం రండీ. ఇక్కడ పోలీసులను చూశారు కదా. వీరు దేనికి కాపలా కాస్తు న్నారో తెలుసా? రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటికి! అవును నిజమే!! ఈ విచిత్ర పరిస్థితి కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో చోటు చేసుకుంది

Andhra Pradesh: మురుగు నీటి కాలువ వద్ద పోలీసు బందోబస్తు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారంతే
Police protection at sewage canal
Pvv Satyanarayana
| Edited By: Basha Shek|

Updated on: Nov 16, 2023 | 1:00 PM

Share

పోలీసులు బందోబస్తు నాయకుల వద్ద, ట్రాఫిక్ లో సభల్లో ఎక్కడెక్కడో డ్యూటీ చేయటం చూశాం.. ఎక్కడైనా మురికి కాలువకు బందోబస్తు పెట్టడం ఎక్కడైనా చూసారా.. చూడకపోతే చూపిస్తాం రండీ. ఇక్కడ పోలీసులను చూశారు కదా. వీరు దేనికి కాపలా కాస్తు న్నారో తెలుసా? రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటికి! అవును నిజమే!! ఈ విచిత్ర పరిస్థితి కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో చోటు చేసుకుంది. ఇక్కడి సర్పంచ్‌కు, మరో వర్గానికి మద్య విభేదాలు ఉన్నాయి. దీంతో ఇళ్లలో వాడిన నీరు, మురుగునీరు వెళ్లే మార్గాన్ని ఒక వర్గం మూసివేయడంతో రోడ్డుపై మురుగునీరు నిలిచిపోయింది. ఆ మురుగునీటిలో నుంచే ఎస్సీ కాలనీవాసులు రాకపోకలు సాగిస్తు న్నారు. మురికికూపం, దుర్గందపూరిత వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులకు విన్నవించినా ఇప్పటి వరకు పరిష్కారం చూపలేదు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా మురుగునీటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు, నేతల వర్గపోరుతో నలిగిపోతున్నా మని, సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. గ్రామానికి డ్రైనేజీ సమస్య ఉండటంతో డ్రైనేజీ పనులు చేస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా ఆపేస్తున్నారని గ్రామ సర్పంచ్ చెబుతున్నారు. ఇరువర్గాలు ఒకే పార్టీకి చెందిన వారు అధిపత్య పోరుతో గ్రామాన్ని మురికి కూపంగా మార్చారని,ప్రజలు ఈ మురికి వలన ఆరునెలలుగా ఇబ్బందులు పడుతు రోగాలబారిన పడుతున్నామని స్ధానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..