AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoists: ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా

ఉమ్మడి విశాఖ జిల్లాలో.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్. ఏఓబీ కేంద్రంగానే మావోయిస్టులు తమ వ్యూహాలకు పదును పెడుతుంటారు. ఈ ప్రాంతం కేంద్రంగా ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ ( ఏఓబీఎస్‎జెడ్‌సీ ) పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆంధ్ర ఒడిశా సరిహద్దులో.. మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ అనేది అత్యంత కీలకం. ఈ కమిటీలో పనిచేసిన నాయకులు.. ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో గల మల్కనగిరి, కోరాపూట్, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతాల్లో దళానికి కీలక పాత్ర పోషించారు.

Maoists: ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
Police
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 23, 2023 | 6:54 PM

Share

ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా మారింది. మావోయిస్టుల ప్రభావం తగ్గిందని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఇంకా అప్రమత్తంగానే ఉంటున్నారు. సాధారణంగా మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల జరుపుకునేటప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు మావోలు. అయితే ఈసారి కూడా ప్రస్తుతం మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో వాటిని భగ్నం చేసేందుకు ముందస్తు వ్యూహంతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. అడవులని జల్లడబడుతూ.. ఏజెన్సీలో నిఘా పెంచారు. ఏకంగా డ్రోన్లను రంగంలోకి దింపి కేంద్ర బలగాలతో పర్యవేక్షిస్తున్నారు. అనుమానితుల కదలికలపై ఆరాతీస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్. ఏఓబీ కేంద్రంగానే మావోయిస్టులు తమ వ్యూహాలకు పదును పెడుతుంటారు. ఈ ప్రాంతం కేంద్రంగా ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ ( ఏఓబీఎస్‎జెడ్‌సీ ) పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆంధ్ర ఒడిశా సరిహద్దులో.. మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ అనేది అత్యంత కీలకం. ఈ కమిటీలో పనిచేసిన నాయకులు.. ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో గల మల్కనగిరి, కోరాపూట్, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతాల్లో దళానికి కీలక పాత్ర పోషించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు అరగోపాల్ అలియాస్ ఆర్కే కూడా ఏఓబీఎస్‎జెడ్‌సీ కి సారథ్యం వహించారు. అందుకే ఏపీలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కడ ఉన్నా.. వారోత్సవాలను ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుని అత్యధిక ప్రాధాన్యంగా తీసుకుంటారు మావోయిస్టులు.

ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్.. డ్రోన్లతో నిఘా.. మరోవైపు వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. గతంలో కూడా పలు సందర్భాల్లో.. మావోయిస్టులు గిరిజనులతో సమావేశంలో నిర్వహించి.. పలుచోట్ల విధ్వంసాలు చేయడం, ఇన్ఫార్మర్ల పేరుతో హత్యల జరిగిన ఘటనలు గతంలో జరిగాయి. దీంతో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, జీకే వీధితో పాటు మరికొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై కన్నేసి పెట్టారు పోలీసులు. ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో కలిసి కూంబింగ్ ముమ్మరం చేసిన అల్లూరు జిల్లా పోలీసులు.. మావోయిస్టుల వ్యూహాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అడవిని జల్లెడ పడుతూనే.. మరోవైపు మావోయిస్టు ప్రాపర్టీ ప్రాంతాల నుంచి వచ్చే అనుమానతులపైన ఆరా తీస్తున్నారు. బాంబు స్క్రాడ్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ తో రోడ్లు, కల్వర్టులను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మావోయిస్టు జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసులు సూచనలు జారీ చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్ళకూడదని సూచించారు పోలీసులు. ఏకంగా డ్రోన్లను రంగంలోకి దింపి కేంద్ర పలకాల సహకారంతో పర్యవేక్షిస్తున్నారు. రాళ్లగడ్డ ఆర్మూర్ అవుట్ పోస్ట్ కు స్వయంగా ఏఎస్‎పీ ప్రతాప్ కిషోర్ వెళ్లి.. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించారు.

ఇవి కూడా చదవండి

అయినా అప్రమత్తంగానే… జిల్లాల విభజన తర్వాత.. పోలీసు నిఘా పెరగడం.. ఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతానికి ఉండడం.. ఐఏఎస్ అధికారులు మారుమూల గ్రామంలో సైతం పర్యటిస్తుండడం.. పోలీసులు కూడా గిరిజనలో మమేకమవుతూ ఇన్ఫార్మర్ వ్యవస్థను మెరుగుపరచుకోవడంతో… దాదాపుగా మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందని పోలీసులు ప్రకటిస్తూ ఉన్నారు. గత రెండేళ్ల వ్యవధిలో.. భారీ స్థాయిలో లొంగుబాట్లు, ఏకంగా ఏరియా కమిటీలే ఖాళీ అవుతుండడంతో ఏ క్షణంలోనైనా మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందనేది నిఘా వర్గాల సూచన. ఈ నేపథ్యంలో.. మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. పోలీసులు.