Polavaram: పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

పోలవరంపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.

Polavaram: పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Polavaram
Follow us

|

Updated on: Sep 07, 2022 | 8:19 AM

Supreme Court on Polavaram project: పోలవరం నిర్మాణంపై పొరుగు రాష్ట్రాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు ఉన్నాయంటూ తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని విస్తరించారని, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతనలేదని ఆరోపించారు. పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష చేయాలంటూ సుప్రీంకోర్టును ఆయా రాష్ట్రాలు కోరాయి. పోలవరం వల్ల భద్రాచలం ఆలయం ముంపునకు గురవుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ వేశారు.

దీంతో ఈ పిటిషన్లన్నింటినీ కలిపి విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రులు, సీఎస్‌ల స్థాయిలో ఉన్నత స్థాయి చర్చలు జరపాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సూచించింది. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 7కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం