Bharat Jodo Yatra: కన్యాకుమారి టు కశ్మీర్.. నేటి నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం..
Rahul Gandhi Bharat Jodo Yatra: తమిళనాడులోని కన్యాకుమారి నుంచి బుధవారం సాయంత్రం ఈ యాత్ర ప్రారంభంకానుంది. సుమారు 3,570 కి.మీ మేర ఈ భారత్ జోడో యాత్ర సాగనుంది.
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సుధీర్ఘ పాదయాత్రకు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి బుధవారం సాయంత్రం ఈ యాత్ర ప్రారంభంకానుంది. సుమారు 3,570 కి.మీ మేర ఈ భారత్ జోడో యాత్ర సాగనుంది. 12 రాష్ట్రాల్లో దాదాపు 148 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ యాత్రలో అగ్రనేతలతో సహా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొననున్నారు. భారత్ జోడో యాత్రకు ముందు శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు.
Tamil Nadu | Congress MP Rahul Gandhi pays floral tribute at Rajiv Gandhi memorial in Sriperumbudur ahead of Bharat Jodo Yatra pic.twitter.com/aV2FAORZgF
ఇవి కూడా చదవండి— ANI (@ANI) September 7, 2022
కన్యాకుమారి నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు స్టాలిన్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్ పాల్గొననున్నారు. తరువాత మహాత్మగాంధీ మండపం నుంచి నుంచి సుధీర్ఘ పాదయాత్ర ప్రారంభం కానుంది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. పాదయాత్ర సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. భారతదేశ చరిత్రలో రాహుల్ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. దేశంలో విభజనవాద రాజకీయాలు, మతోన్మాదంతోపాటు పెరిగిపోతోన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించి.. దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం