Bharat Jodo: బుధవారం నుంచి భారత్ జోడో యాత్ర.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర
Rahul Gandhi: రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. కన్యాకుమారిలో ప్రారంభమయ్యే పాదయాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. మోదీ సర్కార్ వైఫల్యాలను ఈ యాత్రలో రాహుల్ ప్రజలకు వివరిస్తారని చెప్పారు కాంగ్రెస్ నేతలు.
పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపటినుంచి ప్రారంభమవుతోంది. రాహుల్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే ఈ యాత్రలో రాహుల్ సహా ఎంపిక చేసిన కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 150 రోజుల్లో 3500 కిలోమీటర్లపాటు కాంగ్రెస్ సమరసేనాని ఈ యాత్ర చేపడతారు. అడుగు అడుగు కలిసి నడిచి- ఐకమత్యపు గొంతకను వినిపిద్దామంటూ కాంగ్రెస్- తన నినాదాలను విడుదల చేసింది. తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్‌మ్యాప్ చేంజ్ అయ్యింది. ఆక్టోబర్ 24న తెలంగాణలో యాత్ర ప్రవేశిస్తుంది. మక్తల్ నియోజకవర్గం నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభమవుతుంది. తెలంగాణలో 15 రోజుల పాటు కొనసాగుతుంది. యాత్రకు ప్రారభం ముందు రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీకి నివాళులర్పిస్తారు. కన్యాకుమారిలోని జరిగే ఈ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు స్టాలిన్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్ పాల్గొంటారు. తరువాత మహాత్మగాంధీ మండపం నుంచి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ప్రతిరోజు ఎండగడుతారని తెలిపారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. రాహుల్‌గాంధీ తన పాదయాత్రలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రతిరోజు ప్రజలకు వివరిస్తారు. భారత చరిత్రలో రాహుల్ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుంది.
రోజూ రెండు భాగాలుగా ఈ యాత్ర కొనసాగుతుందని, ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతుల చెప్పారు. రోజూ సగటున 22 నుంచి 23 కిలోమీటర్ల చొప్పున మొత్తం 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని రమేశ్ వివరించారు. ప్రధాన యాత్రకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో చిన్న జోడో యాత్రలు నిర్వహిస్తారని తెలిపారు.
భారత్ జోడో యాత్రలో సుదీర్ఘ ప్రసంగాలు, ప్రభోదాలు, డ్రామాలు, టెలీప్రాంప్టర్లు ఉండవని. మన్ కీ బాత్ లా వన్ వే ప్రోగ్రాం కాదని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రజల గోడు విని వారి డిమాండ్లను దిల్లీకి చేర్చడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొంది. ‘మీదో అడుగు, మాదో అడుగుతో దేశాన్ని కలుపుదాం’ అనే నినాదంతో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపింది. . దేశం విభజనకు గురౌతోందన్న కారణంతో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా దేశం విడిపోతోందని, రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని.. అందుకే ఆ యాత్ర చేపడుతున్నామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం