Nitish Delhi Visit: ప్రధాని పదవిపై మోజు లేదంటూనే.. ఢిల్లీలో బీహార్ సీఎం నితీష్ సుడిగాలి పర్యటన
Nitish Kumar: ప్రధాని పదవిపై మోజు లేదంటున్న బీహార్ సీఎం నితీష్ ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వరుసగా విపక్ష నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తన లక్ష్యమంటున్నారు నితీష్..
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్. ఢిల్లీలో వరుసగా విపక్ష నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. సోమవారం రాహుల్‌గాంధీతో సమావేశమైన నితీష్ తాజాగా లెఫ్ట్ నేతలతో భేటీ అయ్యారు. తనకు ప్రధాని పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు నితీష్‌కుమార్. ప్రధాని పదవికి తాను హక్కుదారుడిని కాదన్నారు నితీష్ . తన ఢిల్లీ పర్యటనను కొందరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేయడానికి పనిచేస్తునట్టు చెప్పారు.
ప్రధాని పదవికి తాను హక్కుదారుడిని కాదన్నారు నితీష్ . తన ఢిల్లీ పర్యటనను కొందరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేయడానికి పనిచేస్తునట్టు చెప్పారు. నితీష్‌కుమార్ మళ్లీ విపక్షాలతో జతకలపడం చాలా ఆనందంగా ఉందన్నారు సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని కాపాడడానికి విపక్షాల ఐక్యత అవసరమన్నారు.
నితీష్‌కుమార్ మళ్లీ విపక్షాలతో జతకలపడం చాలా ఆనందంగా ఉందన్నారు సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని కాపాడడానికి విపక్షాల ఐక్యత అవసరమన్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కూడా భేటీ అయ్యారు నితీష్‌కుమార్. తరువాత ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలాతో కూడా చర్చలు జరిపారు. జనతా పరివార్‌ను మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు నితీష్‌కుమార్ . జేడీఎస్ నేత కుమారస్వామితో కూడా ఆయన భేటీ అయ్యారు. శరద్‌పవార్‌తో కూడా చర్చలు జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం