AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: భారీ వర్షాలతో బెంగుళూరు మునకలో తమ తప్పేమి లేదు.. అంతా వారి వల్లే.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలోని బెంగళూరు నగరంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం కావడం, వరద నీటిలో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు..

Karnataka: భారీ వర్షాలతో బెంగుళూరు మునకలో తమ తప్పేమి లేదు.. అంతా వారి వల్లే.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Basavaraj Bommai
Amarnadh Daneti
|

Updated on: Sep 06, 2022 | 11:10 PM

Share

Karnataka: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం కావడం, వరద నీటిలో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టడం, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు చెరువులను తలపించే పరిస్థితులకు తమ ప్రభుత్వం కారణం కాదని.. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణమన్నారు. గత 90 ఏళ్లలో బెంగళూరులో ఈ తరహా వర్షాలను చూడలేదు. అన్ని ట్యాంకులు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిరంతరాయంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం కూడా వర్షాలు పడ్డాయి. అయితే కర్ణాటకలో తాజా పరిస్థితులపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. రెండు జోన్లు సమస్యాత్మకంగా గుర్తించామని, వాటిలో మహదేవపుర ఒకటన్నారు. ఇది చాలా చిన్న ప్రాంతమని… ఇక్కడ 69 ట్యాంకులు ఉండటమే అసలు సమస్య అని అన్నారు. ట్యాంకులన్నీ పొంగి పొర్లుతున్నాయని, ఆక్రమణలు కూడా ఉన్నాయని సీఎం బసవరాజుబొమ్మై చెప్పారు. బెంగళూరులో ప్రస్తుత పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ఏ మాత్రం ప్రణాళికలు లేని అప్పటి ప్రభుత్వ యంత్రాగమే ఈ దుస్థితికి కారణమని, వాళ్లు చెరువులను ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని, చెరువులు, బఫర్ జోన్లలో కూడా అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చేవారని అన్నారు.

ప్రస్తుత పరిస్థితిని తమ ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని, ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లు, వర్కర్లు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రేయింబవళ్లూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం బసవరాజు బొమ్మై చెప్పారు. తాము అనేక ఆక్రమణలకు విముక్తి కల్పించామని, ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉన్నామని తెలిపారు. ట్యాంకులకు స్లూయిజ్ గేట్లు పెట్టడం వంటి చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఆక్రమణల తొలగింపునకు రూ.300 కోట్లు కేటాయించామన్నారు. భవిష్యత్తులో వరద నీటి ముప్పు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంచినీటి సరఫరాలో తలెత్తిన అవాంతరాలపై మాట్లాడుతూ.. మాండ్య జిల్లాలోని రెండు వాటర్ పంపింగ్ స్టేషన్లలో వరద నీటి ప్రభావం ఉందని చెప్పారు. మరో పంప్‌ హౌస్‌కు ఈరోజే క్లియరెన్స్ ఇచ్చామని, ట్యాంకర్లు, బోర్‌వెల్స్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని సీఎం బసవరాజు బొమ్మై వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..