AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అభివృద్ధి పనులపై కలెక్టర్ల సమీక్షలు.. కాకినాడ కేంద్రీయ విద్యాలయం ఘటనపై ఆరా

ఏపీలో జిల్లాల కలెక్టర్లు యాక్టివ్ అయ్యారు. జిల్లా, మండల నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధిపై సమీక్షలు జరిపారు. పనులు జెట్‌ స్పీడ్‌గా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh: అభివృద్ధి పనులపై కలెక్టర్ల సమీక్షలు.. కాకినాడ కేంద్రీయ విద్యాలయం ఘటనపై ఆరా
Kakinada Students
Follow us
Basha Shek

|

Updated on: Sep 07, 2022 | 8:21 AM

ఏపీలో జిల్లాల కలెక్టర్లు యాక్టివ్ అయ్యారు. జిల్లా, మండల నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధిపై సమీక్షలు జరిపారు. పనులు జెట్‌ స్పీడ్‌గా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించారు ఆయా జిల్లాల కలెక్టర్లు. ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే అంశాలపై ఫోకస్ పెట్టారు. కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు.. సమీక్షించారు. పులివెందుల మోడల్ టౌన్‌లో భాగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీ నిర్మాణాలు, బోలే వార్డ్‌, క్రికెట్ స్టేడియం, పులివెందుల-ముద్దనూరు మార్గంలో రాయలాపురం సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు కలెక్టర్. ఈ రివ్యూ మీటింగ్‌లో పాడా ఓఎస్డీ, పులివెందుల మున్సిపాలిటీ ఇంఛార్జ్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు వేర్వేరు శాఖల అధికారులు పాల్గొన్నారు.

అటు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో కేంద్రీయ విశ్వ విద్యాలయంలో జరిగిన ఘటనపై సమీక్షా సమావేశం జరిగింది. విద్యార్థుల అస్వస్థతపై అన్ని విభాగాల అధికారులను ఆరాతీశారు కలెక్టర్‌ కృత్తిక శుక్లా. ఫిఫ్త్‌, సిక్స్త్‌ క్లాస్‌లకు చెందిన విద్యార్థులకు ఊపిరాడక ఒక్కొక్కరుగా సొమ్మసిల్లిపడిపోయారు. విషవాయువులు పీల్చిన కారణంగానే అస్వస్థతకు గురై ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్లాస్‌లు ప్రారంభమైన గంట తర్వాత ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలను ఫుడ్, సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోలర్ అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన విద్యార్థుల క్షేమ సమాచారంపై ఆరాతీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..