AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక శక్తి.. మూడేళ్ల ఏపీ ప్రజల కల సాకారం చేస్తాంః మోదీ

అమరావతి రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక శక్తి.. మూడేళ్ల ఏపీ ప్రజల కల సాకారం చేస్తాంః మోదీ
Pm Modi In Amaravati
Balaraju Goud
|

Updated on: May 02, 2025 | 6:21 PM

Share

అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక శక్తి.. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అదరగొట్టారు. ఆంధ్రా ప్రజలను కలవడం ఆనందంగా ఉందన్న ఆయన.. పలు కీలక అంశాలను తెలుగులోనే చెప్పారు.

అమరావతి రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. అమరావతితో ఒక గొప్ప స్వప్నం సాకారమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి. అదే పేరుతో ఇప్పుడు ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతోందని, అమరావతితో ప్రతి ఆంధ్రుడి స్వప్నం నెరవేరుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎన్టీఆర్ కలలుకన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఏపీకి పట్టిన గ్రహణం వీడిందన్నారు ప్రధాని మోదీ. ఏపీలో అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతోందన్నారు. తనతో పాటు చంద్రబాబు, పవన్ వికసిత్ ఏపీ కోసం కృషిచేస్తామన్నారు.

టెక్నాలజీ విషయంలో చంద్రబాబు దగ్గరే తాను నేర్చుకున్నాన్నారు ప్రధాని మోదీ. ఇది ఎవరికీ తెలియని రహస్యమన్నారు. పెద్దప్రాజెక్ట్‌లు చేపట్టాలన్నా.. వాటిని త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమన్నారు ప్రధాని మోదీ. దశాబ్దాలుగా భారత అంతరిక్ష ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉందన్న ప్రధాని మోదీ.. శ్రీహరికోట కోట నుంచి జరిగే ప్రతి రాకెట్ ప్రయోగం.. యావత్ దేశవాసులను ఉత్తేజం పరుస్తుందన్నారు. నాగాయలంకలో డీఆర్‌డీవో మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసుకోబోతున్నామన్న మోదీ.. ఇది భారత రక్షణ, పరిశోధన రంగానికి మరింత ఊతమిస్తుందన్నారు.

‘పోలవరం ప్రాజెక్టును ఏపీ సర్కార్‌తో కలిసి పూర్తి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ రూ.900 కోట్ల లోపే ఉండేదన్న ప్రధాని మోదీ.. ఇప్పుడు ఒక్క ఏపీకే రూ. 9,000 కోట్ల రైల్వే నిధులు కేటాయించామన్నారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందన్న ప్రధాని, రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు. ఇది ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉందని, అమరావతి నగర నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పూర్తైతే, ఆంధ్రప్రదేశ్ జీడీపీ గణనీయంగా పెరుగుతుందని ప్రధానమంత్రి అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..