Vizag: ఊరు శివారు లేఔట్‌లో కొలతలు తీస్తున్న వ్యక్తి.. ఓ మూలాన కనిపించింది చూడగా
విశాఖలో తీవ్ర కలకలం. మహిళను దారుణంగా హత్య చేసి.. ఆపై నిప్పుపెట్టి ముఖాన్ని కాల్చేశారు. గుర్తు పట్టని విధంగా ముఖాన్ని దహనం చేశారు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. మహిళ మృతదేహం తీవ్ర సంచలనం రేపుతుంది. ఆ వివరాలు ఇలా..

విశాఖలో తీవ్ర కలకలం. మహిళను దారుణంగా హత్య చేసి.. ఆపై నిప్పుపెట్టి ముఖాన్ని కాల్చేశారు. గుర్తు పట్టని విధంగా ముఖాన్ని దహనం చేశారు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. మహిళ మృతదేహం తీవ్ర సంచలనం రేపుతుంది. సగం కాలిన మహిళ మృతదేహంతో పోలీసులు పరుగులు పెడుతున్నారు. భీమిలి తగరపువలస – విజయనగరం రోడ్‌లో మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాకమర్రిలోని ఫార్చ్యున్ లే ఔట్‌లో మహిళ మృతదేహం గుర్తించారు పోలీసులు. హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం కు సమాచారం అందించ్చారు. 25 ఏళ్ల వివాహికంగా గుర్తించారు పోలీసులు. మృతురాలి శరీరంపై గ్రీన్ కలర్ టాప్, పింక్ కలర్ బాటం డ్రెస్ ఉంది.
తగరపువలస విజయనగరం రహదారిలో గుర్తుతెలియని సగం కాలి మహిళ మృతదేహం ఉన్నట్టు మాకు సమాచారం అందింది. 25 ఏళ్ల వివాహితగా అనుమానిస్తున్నాం. ఆరు బృందాలు రంగంలోకి దింపి విచారణ చేస్తున్నాము. మృతి చెందిన మహిళను గుర్తుపట్టిన తర్వాత.. పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని అన్నారు ఏసిపి అప్పలరాజు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురికి తరలించారు. మిస్సింగ్ కంప్లైంట్స్ పై ఆరాతీస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఎక్కడైనా మహిళ మిస్సింగ్ కంప్లైంట్ ఉంటే సమాచారం తెలియజేయాలని భీమిలి పోలీసులు సూచించారు.