Lok Sabha Elections 2024: వీరికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు.. డబుల్ బెనిఫిట్స్ పొందుతున్న గ్రామస్థులు..

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ప్రజలు రెండు రాష్ట్రాలకు ఓటు వేస్తారు. అవును, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా సరిహద్దులో ఉన్న కొటియా గ్రామం చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రాదేశిక వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం రెండు రాష్ట్రాల్లో కోటియా నివాసితులకు ఓటు హక్కు కల్పించబడింది. గ్రామంలోని 2,500 మందికి పైగా ఓటర్లు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రెండు రాష్ట్రాలకు ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు కలిగి ఉన్నారు.

Lok Sabha Elections 2024: వీరికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు.. డబుల్ బెనిఫిట్స్ పొందుతున్న గ్రామస్థులు..
Double Voting
Follow us

|

Updated on: Apr 17, 2024 | 11:46 AM

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ప్రజలు రెండు రాష్ట్రాలకు ఓటు వేస్తారు. అవును, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా సరిహద్దులో ఉన్న కొటియా గ్రామం చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రాదేశిక వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం రెండు రాష్ట్రాల్లో కోటియా నివాసితులకు ఓటు హక్కు కల్పించబడింది. గ్రామంలోని 2,500 మందికి పైగా ఓటర్లు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రెండు రాష్ట్రాలకు ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు కలిగి ఉన్నారు.

దశాబ్ద కాలం నాటి వివాదం..

కోటియా వివాదం 1968లో ఉద్భవించింది. గిరిజన గ్రామాలపై ఒరిస్సా ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటి నుంచి కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టాయి ప్రభుత్వాలు. కానీ ఇది చట్టపరమైన అంశం కావడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు తమ పరిధిలో లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశం పార్లమెంటు చేతుల్లో ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పు తరువాతే ఇరుప్రాంతాల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఏ రాష్ట్రం కూడా ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి సాహసం చేయలేదు.

డబుల్ ఓటింగ్‎కి సంబంధించిన చట్టాలు..

డబుల్ ఓటింగ్‌తో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రాష్ట్రంలో ఓటు వేయాలనేది నేటికీ తేలని ప్రశ్నగా మిగిలిపోయింది. వచ్చే ఎన్నికల్లో కోటియా ప్రాంతానికి చెందిన ఓటర్లు మరోసారి ఈ దుస్థితిని ఎదుర్కోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, ఒరిస్సాలోని కోరాపుట్ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

లబ్ధిదారులకు డబుల్ ప్రయోజనం..

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, కోటియాలో ఎన్నికల చర్చ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధి ఎజెండా చుట్టూ తిరుగుతోంది. ఒరిస్సా కాంక్రీట్ రోడ్లు, విద్యా సంస్థలతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయంపై దృష్టి పెడుతోంది. ఇలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న లబ్ధిని పొందుతున్నార లబ్దిదారులు. రెండు రాష్ట్రాలు అమలు చేసే అన్ని పథకాలతోపాటు ఇరు రాష్ట్రాల హక్కులు కూడా వారికి అందుబాటులో ఉంటాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, కొంతమంది నివాసితులు భౌతికంగా లభించే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తుండగా, మరికొందరు సాంస్కృతిక అనుబంధాలవైపుకు మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ