అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టం వెంకటేష్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని చెక్కాడు. రాముడి ఆకారం చిన్నదే అయినా పెన్సిల్ ముల్లుపై చెక్కడానికి సమయం చాలా ఎక్కువగా పడుతుంది. సుమారు ఆరు గంటలు శ్రమించి ఈ అందమైన శ్రీరాముడి రూపాన్ని తయారు చేశాడు వెంకటేష్.

అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Sri Rama In Pencile
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 17, 2024 | 10:45 AM

ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టం వెంకటేష్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని చెక్కాడు. రాముడి ఆకారం చిన్నదే అయినా పెన్సిల్ ముల్లుపై చెక్కడానికి సమయం చాలా ఎక్కువగా పడుతుంది. సుమారు ఆరు గంటలు శ్రమించి ఈ అందమైన శ్రీరాముడి రూపాన్ని తయారు చేశాడు వెంకటేష్. పలు సందర్బాల్లో తన ప్రతిభను చాటుకున్న వెంకటేష్ సూక్ష్మ కళాకారుల విభాగంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో చోటు సంపాదించాడు. తాజాగా శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరాముడి రూపాన్ని చెక్కి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసాడు.

ఉండేది న్యూయార్క్‎లో..

గట్టెం వెంకటేష్ బేసిక్‎గా నిర్మాణ రంగ నిపుణుడు. సూక్ష్మ కళ ఇతని ప్రవృత్తి. పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల వంటి సూక్ష్మ వస్తువులపై కళాఖండాలను, పేర్లను చెక్కడం లో నైపుణ్యాన్ని సాధించాడు వెంకటేష్. వెంకటేష్ స్వస్థలం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సూరిబాబు, సత్యవతి దంపతులకు 1996, మే 28న జన్మించాడు. వెంకటేష్ ప్రాథమిక విద్యాభ్యాసం గౌతం మాడల్ స్కూలులో గడిచింది. 2019లో విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయంనుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో పట్టా పుచ్చుకున్నాడు. ఉద్యోగ రీత్యా అమెరికాలో అంటున్నాడు.

గిన్నిస్ రికార్డ్స్‎లో..

చిన్ననాటి నుంచి ఇలాంటి సూక్ష్మ కళపై ఆసక్తి పెంచుకున్న వెంకటేష్ పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా 500కిపైగా కళాకృతులను రూపొందించి వందకు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో ఉన్న ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ని టూత్ పిక్ పై చెక్కాలన్నది వెంకటేష్ ఒకప్పటి లక్ష్యం. దానికోసం ఆరు సంవత్సరాలు క‌ష్టప‌డి ఎట్టకేల‌కు దాన్ని మ‌లిచాడు. 18 మిల్లీమీట‌ర్ల పొడ‌వైన అత్యంత సూక్ష్మమైన ఆకృతిలో ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ను టూత్ పిక్ పై చెక్కాడు. ఈ సూక్ష్మ ఆకృతి వెంక‌టేష్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కేలా చేసింది. 19 ఏళ్లవయసుకే ఇతడు ఈ రికార్డ్ సృష్టించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

కళను విస్తరించాలని కోరిక..

ఇతడు తన కళను ఇతరులకు నేర్పడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తుంటాడు. అమెరికాలో ఉన్నా ఇండియాలోని ఇప్పటి వరకు 80 పాఠశాలలో 15,000 విద్యార్థులకు సూక్ష్మకళలో శిక్షణ ఇచ్చాడు. ఎక్కువ ఆన్ లైన్ శిక్షణ‎నే అయినా తాను ఇండియా వచ్చినప్పుడు నేరుగా కలిసి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వ్యర్థపదార్థాల నుండి అలంకరణ వస్తువులను తయారు చేయడం కూడా నేర్పిస్తుంటాడు మన వెంకటేష్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles