AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: అందరూ కలిసి ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

16వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా భీమవరం బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికల్లో తమది పేదలపక్షం అని.. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలంటూ కోరారు. కూటమి నేతలకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయంటూ చెప్పారు.

YS Jagan: అందరూ కలిసి ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2024 | 9:58 PM

Share

మంచి చేసే ఒక్కడి కోసం నిలుస్తారా..? మోసాల చేసేందుకు మూకుమ్మడిగా వచ్చే వాళ్లను ఆదరిస్తారా? నిర్ణయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్‌.. ప్రశ్నిస్తే చంద్రబాబు, పవన్‌, పురంధేశ్వరిలకు బీపీ వస్తుందని సెటైర్లు వేశారు. చంద్రబాబుతోనే అభివృద్ధి అంటూ భజంత్రీల భజనపైనా విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత, సీఎం జగన్‌‌మోహన్ రెడ్డి.. 16వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా భీమవరం బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికల్లో తమది పేదలపక్షం అని.. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలంటూ కోరారు. కూటమి నేతలకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయంటూ చెప్పారు. చంద్రబాబు కోపంతో శాపనార్థాలు పెడుతున్నారని.. తన పైన రాళ్లేయమని, అంతం చేయమని చెబుతున్నారంటూ పేర్కొన్నారు. ఓ వ్యక్తి నియోజకవర్గాలను మారుస్తున్నాడని.. అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారన్నారు.తనకు పేదల సైన్యం అండగా ఉందన్న జగన్‌.. 58 నెలలుగా నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మంచి చేయడం తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని.. మోసాలు చేయడమే చంద్రబాబు ట్రాక్ రికార్డ్‌ అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు ఓవైపు చెరువులో కొంగలా చేపలను తింటూ.. మరోవైపు జపం చేస్తున్నట్లు నటిస్తున్నారని మండిపడ్డారు..సీఎం వైఎస్ జగన్‌. ఆ ప్రశ్న అడిగినందుకే తనపై చంద్రబాబుకు కోపం ఎక్కువయిందన్నారు. మోసాలు పొత్తులను నమ్ముకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు..నియోజకవర్గాలను సైతం అలవోకగా మార్చేస్తున్నాడని ఆరోపించారు..జగన్‌. ఇదేం అన్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే..ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తోందని సెటైర్లు వేశారు. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా? అని ప్రశ్నించారు.

వీడియో చూడండి..

ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని ఆరోపించారు..జగన్‌. వారి బాణాలు తగిలేది.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని ప్రశ్నించారు. బాబువల్లే అభివృద్ధి అంటూ కొంతమంది జాకీపెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జగన్‌.

చంద్రబాబు వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతోనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు జగన్‌. ఇదిగో మైక్రోసాఫ్ట్‌, అదిగో సింగపూర్‌ అంటూ బాబు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారని.. ఇన్ని అబద్దాల తర్వాత చంద్రబాబు సింగపూర్‌ కట్టాడా?బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చిందా? ఒలింపిక్స్‌ జరిగాయా? అని ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…