Skill Development Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. షరతులు ఉల్లంఘించారంటున్న సీఐడీ

ఎన్నికల సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ గండం పొంచి ఉంది. బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం ఉత్కంఠ రేపుతోంది. సీఐడీ ఇప్పుడే ఎందుకీ పిటిషన్ వేసింది ? అనేదీ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Skill Development Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. షరతులు ఉల్లంఘించారంటున్న సీఐడీ
Chandrababu
Follow us

|

Updated on: Apr 16, 2024 | 8:39 PM

ఎన్నికల సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ గండం పొంచి ఉంది. బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం ఉత్కంఠ రేపుతోంది. సీఐడీ ఇప్పుడే ఎందుకీ పిటిషన్ వేసింది ? అనేదీ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపున వాదనలు వినిపించిన రంజిత్ కుమార్.. చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఇటీవల పలు టీవీ ఛానెళ్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు, రెడ్ డైరీ పేరుతో హచ్చరికలను కూడా ప్రస్తావించారు. రెడ్ బుక్‌లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నాం.. అధికారంలోకి వచ్చాక అందరి పని చెప్తాం అంటూ లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ వ్యాఖ్యానించింది.

అయితే లోకేష్ మాట్లాడితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందంటూ.. చంద్రబాబు తరపు లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదించారు. దీంతో తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసిన సుప్రీం కోర్ట్. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దంటూ చంద్రబాబును ఆదేశించింది భారత అత్యున్నత న్యాయస్థానం.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై 53 రోజుల పాటు జైలులో ఉన్న చంద్రబాబుకు.. తొలుత మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను హైకోర్ట్ మంజూరు చేసింది. ఈ షరతులు ఉల్లంఘించారంటూ ఇప్పుడు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించింది సీఐడీ. ఈ పిటిషన్‌పై మే 7న సుప్రీం కోర్ట్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది. చంద్రబాబు బెయిల్ కంటిన్యూ అవుతుందా.. లేక రద్దవుతుందా అనేది ఉత్కంఠను రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles