AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? అమరరాజా కంపెనీ కొద్దిరోజులు మూసివేయడానికి, అదనపు పెట్టుబడులు పారపోవడానికి కూడా పెద్దిరెడ్డి కుటుంబమే కారణమా? రోజా, నారాయణస్వామి వంటి నాయకులపై వచ్చిన ఆరోపణలను నిజమేనా? దీనిపై సంచలన విషయాలు బయటపెట్టారు మిథున్‌రెడ్డి.

Balaraju Goud
|

Updated on: Apr 11, 2026 | 8:44 PM

Share

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టీవీ9 క్రాస్ ఫైర్ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గంపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. పుంగనూరు అత్యంత శాంతియుత నియోజకవర్గమని, అక్కడ ఎలాంటి గొడవలకు ప్రజలు ఇష్టపడరని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలను వివరించారు. పోలీసుల సూచనలను పాటించకుండా తెలుగుదేశం కార్యకర్తలే గొడవలకు పాల్పడ్డారని అన్నారు. టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో మిథున్‌ రెడ్డి పుంగనూరు రాజకీయాలపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

రెడ్ బుక్ ప్రచారం కేవలం ప్రతిపక్షాల హైప్ అని, పుంగనూరులో తాము ప్రజల మద్దతుతోనే గెలుస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలను బలవంతంగా చేయించలేదని, ప్రతిపక్షాలకు నామినేషన్ వేసే ధైర్యం లేదని అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో పుంగనూరులో గణనీయమైన అభివృద్ధి పనులు చేశామని మిథున్ రెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలు బలవంతంగా జరిగాయనే ఆరోపణలను ఖండించిన మిథున్ రెడ్డి, ప్రతిపక్షాలు నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదని పేర్కొన్నారు. రామచంద్ర అనే వ్యక్తికి కేవలం 2000 ఓట్లు వచ్చాయని, ఆయనకు వచ్చిన పబ్లిసిటీ నమ్మవద్దని అన్నారు. తమ నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యర్థులు ఉన్నారని, అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పుంగనూరును అత్యంత శాంతియుత నియోజకవర్గంగా అభివర్ణించారు. అమర్ రాజా కంపెనీ విషయంలో తమ కుటుంబం జోక్యం చేసుకుందని వచ్చిన ఆరోపణలను మిథున్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గల్లా జయదేవ్ తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, అమర్ రాజాకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. ఇవి కేవలం తప్పుడు ప్రచారాలని, వ్యక్తిగత విరోధాలు తమకు లేవని తెలిపారు. రాజకీయ పరంగా మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అంతేగానీ వ్యక్తిగతంగా గౌరవం ఉందని చెప్పారు.

రోజా వ్యవహారంపై కూడా మిథున్ రెడ్డి స్పందించారు. రోజా తమ బంధువని, ఆమె తండ్రి, తన తండ్రి మంచి స్నేహితులని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే మంత్రులు అవుతారని, ఆమె గెలుపు కోసం తాను కృషి చేశానని చెప్పారు. చక్రపాణి రెడ్డి, జేకే శాంతిలను పెంచి పోషించారనే ఆరోపణలు నిరాధారమని, వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితేనే వారికి వ్యతిరేకమని అన్నారు. రోజా స్వయంగా కోరితేనే వారికి శ్రీశైలం దేవస్థానం సభ్యత్వాలు ఇచ్చారని వివరించారు. నారాయణ స్వామికి మంత్రి పదవి ఇప్పించి తమ గుప్పెట్లో పెట్టుకున్నారనే ఆరోపణలను కూడా మిథున్ రెడ్డి ఖండించారు. నారాయణ స్వామి సీనియర్ నాయకుడని, జగన్ మోహన్ రెడ్డికి ఆయనపై మంచి అభిప్రాయం ఉందని, ఆయన నిజాయితీపరుడని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us