Pawan Kalyan: తెచ్చిన అప్పులు, వచ్చిన ఆదాయం ఎటుపోతోంది.. జీతాలు, ఫించన్లు ఎందుకు ఆలస్యం అంటూ జనసేనాని ప్రశ్న
Pawan Kalyan: ఏపీ సర్కార్ కు ఆర్ధిక నియంత్రణ లేదంటూ.. వచ్చిన ఆదాయం, తెచ్చిన అప్పులు ఎటుపోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా జనసేనాని..
Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా జనసేన పార్టీ అధినేత.. ఏపీ సర్కార్ కు ఆర్ధిక నియంత్రణ లేదంటూ.. వచ్చిన ఆదాయం, తెచ్చిన అప్పులు ఎటుపోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నలను సంధించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు జీతాలు, ఫించన్లు సకాలంలో చెల్లించక పోవడం ప్రభుత్వానికి లోపించిన ఆర్ధిక క్రమ శిక్షణను తెలియజేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను మరచిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. ఎప్పుడు జీతాలు, పెన్షన్లు వస్తాయో తెలియదు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ గాడి తప్పడమే ఇందుకు కారణం అంటూ ఆరోపించారు పవన్ కళ్యాణ్. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దశాబ్దాల పాటు సర్వీస్ చేసిన వారు విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అనుకుంటారు. వృద్ధ్యాప్యంలో వారికి వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారం… వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే వారు మానసికంగా వేదనకు లోనవుతారని అన్నారు జనసేనాని.
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసునని .. జీతం మీద, వచ్చే పెన్షన్ తోనూ ఎంతో ఆత్మాభిమానంగా జీవిస్తారు. మా నాన్నగారు ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన ఎంత ఆత్మాభిమానంతో ఉండేవారో చూసిన వాడిని.. ప్రభుత్వం తమకు ఇచ్చే జీతంతో ఉద్యోగులు ప్రణాళికతో ఖర్చు చేసుకొంటారు. బ్యాంక్ లోన్లను వాయిదాలు, పిల్లల చదువులు, ఖర్చులు, ఇతర అవసరాలు ఇలా ఎన్నో ఉంటాయి..మరి సమయానికి జీతం ఇవ్వకపోతే ఎంత కాలం వారు చేబదుళ్లతో జీవితం నెట్టుకుని రావాలి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పోలీస్ శాఖను నిరంతరం డ్యూటీలో ఉంటారు. వారికీ 11 నెలల నుంచి టి.ఏ. కూడా చెల్లించడం లేదు వారి సరెండర్ లీవులు రావాలిన సొమ్ములు ఇవ్వడం లేదు.. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని అందుకనే అనంతపురం కొత్తచెరువు సభలో ప్రస్తావించినట్లు పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకూ 7 డీ.ఏ లు బకాయిపడింది. పి.ఆర్.సి అమలు చేయడం లేదు. జీతం ఇవ్వడమే ఆలస్యం చేస్తే ఇక డి ఏ టి ఏలు , పి ఆర్ సీలు అడగరు జీతం వస్తే అదే పదివేలు అనుకుంటారు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వచ్చే అదాయం గత అధిక సంవత్సరం కంటే పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో భాగంగా జీతభత్యాల చెల్లింపులు చేయడం లేదంటే ప్రభుత్వ ఆదాయం ఎటు పోతుంది.. ప్రతి నెలా తెస్తున్న అప్పులు ఏమై పోతున్నాయంటూ పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ పై సోషల్ మీడియా వేడికాగా ప్రశ్నస్త్రాలు సంధించారు.
Also Read: నాడు పోషకులం… నేడు యాచకులం అంటూ ఏపీలో.. పోరుబాట పట్టిన కాంట్రాక్టర్లు