AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ మంత్రిపై కీలక ఆరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతులు..

మాజీ మంత్రి విడదల రజిని విషయంలో స్పీడ్‌పెంచారు పసుమర్రు రైతులు. నిన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని కలిసిన రైతులు.. ఇవాళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. విడదల రజినిపై చర్యలు తీసుకొని .. న్యాయం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు పసుమర్రు రైతులు. జగనన్న కాలనీ పేరుమీద తమ గ్రామంలో 200 ఎకరాలు సేకరించారని.. తమ నుంచి కొన్న ఒక్కో ఎకరానికి రెండున్నర లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు రైతులు.

మాజీ మంత్రిపై కీలక ఆరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతులు..
Formers Land
Srikar T
| Edited By: |

Updated on: Jun 21, 2024 | 11:30 PM

Share

మాజీ మంత్రి విడదల రజిని విషయంలో స్పీడ్‌పెంచారు పసుమర్రు రైతులు. నిన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని కలిసిన రైతులు.. ఇవాళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. విడదల రజినిపై చర్యలు తీసుకొని .. న్యాయం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు పసుమర్రు రైతులు. జగనన్న కాలనీ పేరుమీద తమ గ్రామంలో 200 ఎకరాలు సేకరించారని.. తమ నుంచి కొన్న ఒక్కో ఎకరానికి రెండున్నర లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు రైతులు. ఫేజ్‌ల వారిగా భూమిని కొన్న రజిని ఒక్క ఫస్ట్‌ ఫేజ్‌లోనే రైతుల నుంచి కోటి రూపాయలు కలక్ట్ చేశారని ఆరోపించారు. రజిని, ఆమె పీఏ, బంధువు గోపి డబ్బు వసూలు చేశారని చెప్పారు పసుమర్రు రైతులు.

మధ్యవర్తిగా పసుమర్రుకి చెందిన ఉమమహేశ్వరరావు ద్వారా చెక్కులు, క్యాష్ తీసుకున్నారని వివరించారు. కేసుకు సంబంధించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇదే వ్యవహారంపై ముందుగా చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పుల్లారావును కలిశారు పసుమర్రు రైతులు. ఇళ్ల స్థలాల పేరుమీద తమనుంచి సుమారు రూ.10కోట్లు వసూలు చేశారని.. తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని ఎమ్మెల్యే పుల్లారావుని వేడుకున్నారు రైతులు. గతంలో ఆమెకు భయపడి కంప్లైంట్ చేయలేకపోయామని కూడా చెప్పుకొచ్చారు రైతులు. జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పసుమర్రు రైతులకు న్యాయం చేస్తానని మాటిచ్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..