Murali Mohan: పవన్‌లో నాకు నచ్చే అంశం అదే, ఆయన కచ్చితంగా సీఎం అవుతారు.. మురళీ మోహన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Murali Mohan: ఒకప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న మురళీ మోహన్‌ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో...

Murali Mohan: పవన్‌లో నాకు నచ్చే అంశం అదే, ఆయన కచ్చితంగా సీఎం అవుతారు.. మురళీ మోహన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2022 | 6:25 AM

Murali Mohan: ఒకప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న మురళీ మోహన్‌ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారీ టీడీపీ సీనియర్‌ నేత. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కచ్చితంగా ముఖ్యంత్రి అవుతారని మురళీ మోహన్ జోస్యం చెప్పారు. అది ఎప్పుడనే విషయం తెలియకపోయినప్పటికీ, ఏదో రోజు మంచి స్థానానికి తప్పకుండా చేరుకుంటారని చెప్పుకొచ్చారు. పవన్‌తో పాటు, మెగా బ్రదర్స్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు మురళీ మోహన్‌. ప్రస్తుతం క్రీయాశీలక రాజకీయాల్లో లేనని, ఏపీ పాలిటిక్స్‌ గురించి మాట్లాడను అంటూనే జనసేనాని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు.. వారి వల్ల కాకపోతే వెళ్లిపోతారు.. పవన్ కళ్యాణ్ అలా కాదు.. తను సక్సెస్ అయ్యినా అవ్వకపోయినా.. పార్టీని నమ్ముకుని.. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతున్నారు. అతనిలో నాకు నచ్చే అంశం అదే. పవన్‌ ఏదో ఒక రోజు తప్పుకుండా ముఖ్యమంత్రి అవుతారు. అలా అయినరోజున మా సినిమా వాళ్ల నుంచి మరొకరు ముఖ్యమంత్రి అయ్యాడని గర్వపడతా. పవన్ కళ్యాణ్‌తో ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు కానీ.. నేను పోటీ చేసినప్పుడు బీజేపీ, జనసేన నాకు సపోర్ట్ చేశాయి. ఆ సమయంలో నా తరుపున రాజమండ్రిలో పవన్‌ ప్రచారం చేశారు’ అని చెప్పుకొచ్చారు.

ఇక మెగా బ్రదర్స్‌లో మిగిలన వాళ్లంతా ఉన్న సాన్నిహిత్యం పవన్‌తో లేదని చెప్పిన మురళీ మోహన్‌.. ‘పవన్‌ తన పని తను చేసుకొని పోతాడు తప్పితే మిగిలిన విషయాల గురించి పట్టించుకోరు. చిరంజీవి అలా కాదు.. ఎప్పుడైనా సరదాగా ఫోన్ చేస్తే.. ఏంటన్నయ్యా.. ఏం చేస్తున్నావ్.. సరదాగా షూటింగ్‌కి రాకూడదు అని అంటారు. లంచ్ అక్కడ చేద్దాం అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. పవన్ కళ్యాణ్‌తో బాగున్నారా అంటే బాగున్నారా? అంతవరకే ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..