AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP AP: ఆ విషయాలపై హిందూ సమాజానికి క్లారిటీ ఇవ్వండి.. సీఎం జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖ..

దేవాదాయ ధర్మాదాయ శాఖ పట్ల ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. హైందవ దేవాలయాలు అన్నీ దర్శినీయ క్షేత్రాలనే విషయాన్ని ప్రభుత్వం పొరపడుతున్నట్ల అర్ధం అవుతోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పేర్కొన్నారు.

BJP AP: ఆ విషయాలపై హిందూ సమాజానికి క్లారిటీ ఇవ్వండి.. సీఎం జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖ..
Ap Bjp Chief Somu Veerraju
Shaik Madar Saheb
|

Updated on: Jul 17, 2022 | 7:58 AM

Share

BJP Andhra Pradesh: బీజేపీ అంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలపై క్లారిటీ ఇవ్వాలంటూ సోము వీర్రాజు (Somu Veerraju) డిమాండ్ చేశారు. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలు, మొక్కుబడుల సొమ్ములను, దేవాలయ నిర్వహణా ఖర్చులు పోను, మిగిలిన సొమ్మును బ్యాంక్‌లలో ఫిక్సెడ్ డిపాజిట్ (F.D) చేయడం ద్వారా భవిష్యత్ అవసరాల కోసం వినియోగంచే సొమ్మును విత్ డ్రా చేయించడం.. ఆ సొమ్మును సర్వశ్రేయోనిధికి జమ చేయమని దేవాదాయ శాఖ కమీషనర్ ద్వారా ఆలయాల ఇవోలకు ఆదేశాలు జారీ చేశారా ? లేదా ? అన్న విషయం హిందూసమజానికి వెల్లడించాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పట్ల ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. హైందవ దేవాలయాలు అన్నీ దర్శినీయ క్షేత్రాలనే విషయాన్ని ప్రభుత్వం పొరపడుతున్నట్ల అర్ధం అవుతోందన్నారు. హిందూ ధర్మ ఆచార వ్యవహారాలను ప్రభుత్వం విస్మరించినట్లుంది.

దేవాలయాలు సందర్శినీయ క్షేత్రాల విషయంలో ప్రభుత్వం పొరబడితే నిర్ణయాలు మార్చుకోవాలని కోరుతున్నానన్నారు. భక్తులు రూపాయి,10రూపాయిలు, నుంచి దక్షిణ, కానుకులుగా ఇచ్చిన సొమ్ములో కొంత ఆదాచేసి సంవత్సరాలతరబడి దాచిన పొదుపు మొత్తాలను చిన్న చిన్న ఆలయాలు ఎఫ్‌డిలలో భద్రపర్చుకుంటే ఆ మొత్తాలను కూడా ప్రభుత్వం దోచుకోవడానికి పూనుకోవడం అత్యంత దారుణమని సోము వీర్రాజు మండిపడ్డారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా హిందూ ఆలయాలకు ఒరిగిందేమీ లేకపోగా ఉద్యోగుల జీతభత్యాలకు తోడు చివరకు ఈ పొదుపు మొత్తాలను కూడా కామన్ గుడ్ ఫండ్ పేరిట ప్రభుత్వ ఖాతాలకు మళ్లీంచడం తగదన్నారు. ముల్లాలకు, ఫాస్టర్లకు గౌరవ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే చెల్లిస్తున్నారు. భక్తుల కానుకలు ద్వారా మాత్రమే హిందూ ఆలయాల నుంచి వచ్చే సొమ్ములను మాత్రం దేవాదాయ శాఖ పెత్తనం ద్వారా ఆలయాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను కొల్లగొడుతున్నారన్నారు.

ఔరంగ జేబు, నైజాం నవాబు సహితం చేయని విధంగా ఆలయాల సొమ్మును దోచేయడం నీతి భాహ్య చర్యగా భావిస్తున్నానంటూ పేర్కొన్నారు. దేవుడు మాన్యాలు ఇప్పటికే రకరకాల పధకాల పేరిట కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు ఆలయాల నిత్య దీప, ధూప నైవేద్యాల కోసం ఫిక్సడ్ డిపాజిట్లుగా దాచుకున్న చిన్న మొత్తాలను కూడా కామన్ గుడ్ ఫండ్ లో జమ చేయించడం, ధర్మం కాదని గ్రహించాలని సోము పేర్కొన్నారు. హిందువుల విశ్వాసాలను క్రమేపి దెబ్బతీయడమే లక్ష్యంగా గత మూడు సంవత్సరాలుగా పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. కామన్ గుడ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది, కానీ ఇందులో జమఅయిన దేవాలయాల నిధులను అన్యమతస్థులకు పంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం తగదంటూ లేఖలో పేర్కొన్నారు. దేవాలయాల విషయంలో మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు బలపడే విధంగా ప్రభుత్వ ఆదేశాలు కనపడుతున్నాయని.. ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోవాలని సోము వీర్రాజు బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి