Andhra Pradesh: మద్యం స్టఫ్ కారణంగా నిండు ప్రాణం బలి.. కొంప ముంచిన చేప ముక్క..
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు మందుబాబులు మద్యం సేవిస్తూ స్టఫ్ కోసం పడిన ఘర్షణ ఏకంగా ఓ నిoడు ప్రాణాన్నే బలిగొంది. ఈ ఘటన శ్రీకాకుళo జిల్లా పలాస సూదికొండ సమీపంలోని ముస్లిం కాలనీలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కాలనీలో మద్యం సేవిస్తూ స్టఫ్ గా తింటూన్న చేప ముక్క విషయంలో షేక్ దాస్ అనే యువకుడు మరో యువకుడు గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి అది కాస్త ఘర్షణకు దారి తీసింది...

ఎవరి విషయంలోనైనా వేలు పెట్టొచ్చు కానీ మందుబాబుల విషయంలో మాత్రం జర భద్రంగా ఉండాలని చెబుతుంటారు. ఎందుకంటే మద్యం మత్తులో విచక్షణ కోల్పోతారు మందుబాబులు. ఆ సమయంలో ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడతారు. మద్యం మత్తులో చాలా దారుణాలు జరిగిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు మందుబాబులు మద్యం సేవిస్తూ స్టఫ్ కోసం పడిన ఘర్షణ ఏకంగా ఓ నిoడు ప్రాణాన్నే బలిగొంది. ఈ ఘటన శ్రీకాకుళo జిల్లా పలాస సూదికొండ సమీపంలోని ముస్లిం కాలనీలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కాలనీలో మద్యం సేవిస్తూ స్టఫ్ గా తింటూన్న చేప ముక్క విషయంలో షేక్ దాస్ అనే యువకుడు మరో యువకుడు గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి అది కాస్త ఘర్షణకు దారి తీసింది. వీధిలోనే నివాసం ఉంటున్న సయ్యద్ ఖాదర్ అనే 67ఏళ్ల వ్యక్తి యువకుల ఘర్షణను చూసి తనకు సంబంధం లేకపోయినప్పటికీ గొడవను నివారిద్దామని భావిoచాడు.
అదే ఆయన చేసిన తప్పు. అసలే కోతి అందులోకి కళ్ళు తాగింది అన్నట్టుగా…. అసలే యువకులు అందులోకి మద్యం మత్తులో ఉండటంతో వారిని కట్టడి చేయటం కష్ట సాధ్యమైన పనే. అప్పటికి సయ్యద్ ఖాదర్ ఘర్షణ వద్దంటూ ఇద్దరు యువకులతో వారించాడు. షేక్ దాస్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అంతే మద్యం మత్తులో ఉన్న షేక్ దాస్ మరింత రెచ్చిపోయాడు. గొడవలో అడ్డుకున్న సయ్యద్ ఖాదర్ పై దాడికి దిగాడు. షేక్ దాస్ విచక్షణ రహితంగా దాడి చేసి చెంబుతో తలపై మోదటంతో సయ్యద్ ఖాదర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
కటకటాల పాలైన షేక్ దాస్…
సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలిసులు కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ దాస్ ను అదుపు లోకి తీసుకున్నారు పోలీసులు. ఖాదర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఖాదర్ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయి అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొత్తానికి మందు స్టఫ్ కోసం ఇద్దరు యువకులు ఘర్షణకు దిగటం కాస్త కామెడీగా అనిపించినా మద్యo మత్తులో విచక్షణ కోల్పోయి ఏకంగా ఓ నిండు ప్రాణాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




