Sr NTR Daughters: సందడే సందడి.. ఎన్టీఆర్ కూతుళ్లు ఢిల్లీలో ఏం చేశారో తెలుసా..?

|

Aug 29, 2023 | 4:45 PM

Sr NTR Daughters in Delhi: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ స్మారక నాణాన్ని విడుదల చేశారు.

Sr NTR Daughters: సందడే సందడి.. ఎన్టీఆర్ కూతుళ్లు ఢిల్లీలో ఏం చేశారో తెలుసా..?
Nandamuri Family
Follow us on

Sr NTR Daughters in Delhi: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఒకరిద్దరు మినహా నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఎన్టీఆర్ తనయులు, కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అంతా హాజరయ్యారు. నందమూరి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరవ్వడంతో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు నందమూరి తారకరామారావు కుమారులు, కుమార్తెలకు మాత్రమే చోటు కల్పించారు. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కుమార్తెలు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, ఉమా మహేశ్వరి వేదికపై కనిపించారు.

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల నేపథ్యంలో నందమూరి కుటుంబసభ్యులంతా ఒక్కరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులంతా ఢిల్లీలో సందడి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కుమార్తెలు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, ఉమా మహేశ్వరి దేశ రాజధానిలో షాపింగ్ చేస్తూ డీఎల్ఎఫ్ మాల్‌లో సందడి చేశారు. వారి పిల్లలతో కలిసి పలు ప్రదేశాలను సందర్శించారు. ఎప్పుడూ ఏదో ఒక బిజీలో ఉండే ఎన్టీఆర్ కుమార్తెలు ముగ్గురూ కూడా సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కాగా, దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్రస్ట్ కార్యక్రమాలను చూస్తుంటారు.

ఇవి కూడా చదవండి

కాగా, నిన్న విడుదలైన ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విక్రయాలు దేశ వ్యాప్తంగా ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం 12వేల వంద రూపాయల కాయిన్స్ ముద్రించారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు మింట్ కాంపౌండ్ వద్ద బారులు తీరారు. మూడు రకాలుగా ఉన్న ఈ వంద రూపాయల ఒక్క నాణెం రూ. 4050 నుంచి 4850గా నిర్ణయించి విక్రయిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..